16 ఏళ్లుగా కూతురిపై తండ్రి రేప్: 2 సార్లు గర్భవతి
ముంబై: సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు ఉత్తరాది రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కన్న కూతురిపై అత్యాచారం చేసి, రెండు సార్లు గర్భవతిని చేశాడో తండ్రి. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని బిడ్ జిల్లాలో ఉన్న పార్లి అనే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల కన్న కూతురిపై 16 ఏళ్లుగా ఆ తండ్రి తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి బీడ్ జిల్లా పోలీసు కమిషనర్‌ను కలిసి నేరుగా ఫిర్యాదు చేసింది.

అందులో తనకు ఆరేళ్ల వయసు నుంచి తన తండ్రే తనను లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపింది. అతని ద్వారా ఇప్పటికే ఒక బిడ్డకు తల్లి కాగా, మరోమారు గర్భం దాల్చినట్టు తెలిపింది. ఈ విషయం గురించి తల్లితో చెబితే, ఆమె కూడా తండ్రికే మద్దతు తెలిపింది.
ప్రస్తుతం మూడు నెలల గర్భాన్ని అబార్షన్ చేయాలని తల్లిదండ్రులు బలవంత చేస్తున్నారని కూడా పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ యువతి తల్లిదండ్రులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.












Click it and Unblock the Notifications