9 ఏళ్లకే తండ్రి హత్య: ట్యూషన్లు చెప్పిన చేతులే.. నేడు దేశ రక్షణకు తుపాకీ పట్టాయి!
BSF Success Story: కష్టాలను మనుషులను కుంగదీయవచ్చు.. కానీ పట్టుదల ఉంటే అవే కష్టాలను విజయానికి మెట్లుగా మార్చుకోవచ్చని నిరూపించింది జార్ఖండ్‌కు చెందిన రంజనా కుమారి. 9 ఏళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయి, పేదరికంతో పోరాడి, నేడు సరిహద్దు భద్రతా దళంలో కానిస్టేబుల్‌గా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఆ ఒక్కరోజు.. ఆ కుటుంబం చిన్నాభిన్నం
జార్ధండ్‌లోని హజారీబాగ్ జిల్లాకు చెందిన రంజనాకుమారి జీవితం 2013 జనవరి 1వ తేదీన ఒక్కసారిగా తలకిందులైంది. కొత్త సంవత్సరం వేడుకల రోజున హోటల్ కార్మికుడైన ఆమె తండ్రి మనోజ్ కుమార్ కుష్వాహా హత్యకు గురయ్యారు. కుటుంబానికి ఏకైక ఆధారమైన తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. భర్త చనిపోయినా తల్లి నూతన్ దేవి గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. ముగ్గురు కుమార్తెలను చదివించాలని నిర్ణయించుకుని అంగన్వాడీ కార్యకర్తగా చేరింది. రంజనా ముగ్గురు సోదరీమణులలో రెండో వారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేస్తున్న రంజన.. చదువుకుంటూనే తన వంతు సహాయం చేయాలనుకుంది.

హైస్కూల్ చదువుతున్న వయసులోనే సుమారు 40 మంది గ్రామీణ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. దీని ద్వారా వచ్చిన డబ్బుతో తన చదువుకు కావాల్సిన ఖర్చులను భరించడమే కాకుండా తల్లికి అండగా నిలిచింది. విష్ణుగఢ్ డిగ్రీ కళాశాల నుంచి హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
లక్ష్యం వైపు అడుగులు.. ఖాకీ దుస్తుల్లో మెరిసిన కల
2024లో నిర్వహించిన SSC GD కానిస్టేబుల్ పరీక్షలో రంజనా ప్రతిభ చాటి BSFకు ఎంపికైంది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఏడాది పాటు కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుంది. ఇటీవల జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో రంజనా యూనిఫాం ధరించి నడుస్తుంటే, ఆమె తల్లి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. "నేను మొదటిసారి ఈ యూనిఫాం ధరించినప్పుడు నా కళ్ల ముందు మా నాన్న ముఖమే కదిలింది. ఈ విజయం నా తల్లి పడ్డ కష్టానికి ప్రతిఫలం" అని రంజనా భావోద్వేగంతో చెప్పింది.
తోటి యువతకు స్ఫూర్తి సందేశం
ప్రస్తుతం రంజనా భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని జైసల్మేర్ సెక్టార్‌లో తన మొదటి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "మీ బాధను బలహీనతగా మార్చుకోకండి, దాన్ని మీ శక్తిగా మార్చుకోండి. పేదరికం, కష్టాలు చదువుకు అడ్డుకావు" అంటూ తోటి అమ్మాయిలకు పిలుపునిచ్చింది. తండ్రిని కోల్పోయిన విషాదం నుంచి దేశాన్ని రక్షించే స్థాయికి ఎదిగిన రంజనా కుమారి కథ నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications