కూతురినే కాటేసిన తండ్రి: ఎనిమిది నెలలు నరకం, ఫలితంగా !

కర్ణాటకలోని సూరత్కల్ ప్రాంతంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న కన్న కూతురు మీద గత ఎనిమిది నెలలుగా తండ్రి అత్యాచారం చెయ్యడంతో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. కన్న కుమార్తెను తల్లిని చేసిన కామాంధుడి కోసం పోలీసులు గాలిస

బెంగళూరు: ఇంటిలో ఒంటరిగా ఉన్న కుమార్తెను బెదిరించి ఎనిమిది నెలల నుంచి అత్యాచారం చేస్తున్న ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని సూరత్కల్ పట్టణంలో జరిగింది. కూతురు మీద అత్యాచారం చేసిన కామాంధుడు పరారైనాడు.

సూరత్కల్ లోని శశితులు ప్రాంతంలో వామన బంగేరా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ కుమార్తె (మైనర్) ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురు మీద ఇతని కన్ను పడింది. భార్య ఇంటిలో లేని సమయంలో కుమార్తెను బెదిరించి గత ఎనిమిది నెలల నుంచి అత్యాచారం చెయ్యడం మొదలుపెట్టాడు.

Father raped her own daughter in Sasihitlu of Suratkal region in Udupi.

విషయం బయటకు తెలిస్తే నిన్ను, మీ అమ్మను చంపేస్తానని బెదిరించాడు. ప్రాణ భయంతో ఆమె విషయం బయటపెట్టలేదు. కనీసం కుమార్తె గర్బవతి అనే విషయం ఆమె తల్లి గుర్తించలేకపోయింది. కడుపు నోప్పి ఎక్కువ కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. మీ కుమార్తె గర్భవతి అని వైద్యులు బాలిక తల్లికి చెప్పారు.

అప్పటికే బాధితురాలు విషయం బయటకు చెప్పలేదు. పోలీసులు వచ్చి విచారణ చెయ్యగా తన తండ్రే అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. పోలీసులకు విషయం తెలిసిందని గుర్తించిన వామన బంగేరా పరారైనాడు. బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిందని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+