విద్యార్థినితో అసభ్యకరరీతిలో దొరికిపోయిన ప్రొఫెసర్, చితకబాదారు
అలహాబాద్: ప్రసిద్ధ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు తన విద్యార్థినితో అసభ్య భంగిమలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇది తెలిసిన విద్యార్థులు ఆయన ఇంట్లోకి వెళ్లి ప్రొఫెసర్‌ను బయటకు లాగి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అంతకుముందే రెండో రోజుల క్రితం మరో విద్యార్థినితో అతను ఇలాంటి స్థితిలోనే కనిపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
తనను ఇంటికి పిలిచి లైంగికంగా వేధించాడని విద్యార్థిని తొలుత ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత ఆమె మాట మార్చినట్లుగా తెలుస్తోంది. యూనివర్సిటీ అధికారులు ఈ ఘటన పైన విచారణ జరుపుతున్నారు.

ఓ విద్యార్థినితో అసభ్య భంగిమలో పట్టుబడ్డ సదరు ప్రొఫెసర్ కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ప్రొఫెసర్‌ను దాదాపు పన్నెండు మంది చితకబాదారు. అందులో ముగ్గురి పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రొఫెసర్ పైన దాడి చేసిన వారు పన్నెండు మంది ఉన్నారని, వారిని గుర్తించవలసి ఉందని పోలీసులు చెబుతున్నారు. వారి పైన గ్యాంగ్ స్టర్ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications