బెంగళూరు జక్కూరు ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం, రన్ వే సమీపంలో, సిగరేట్ దెబ్బ!
బెంగళూరు: బెంగళూరు నగరంలో వీవీఐపీ విమానాలు, హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే జక్కూరు ఎయిర్ పోర్టులో శనివారం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. రన్ వే సమీపంలోనే మంటలు వ్యాపించడంతో జక్కూరు ఎయిర్ పోర్టు సిబ్బంది ఆందోళనకు గురైనారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అనేక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు పూర్తిగా అదుపు చేశారు. రన్ వే సమీపంలోనే మంటలు ఎలా వ్యాపించాయి అనే విషయంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

మంటలు వ్యాపించిన సమయంలో రన్ వే మీద ఎలాంటి విమానాలు లేకపోవడంతో పెద్ద ప్రమాధం తప్పిందని పోలీసులు అన్నారు. రన్ వే సమీపంలో గడ్డి ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎవరో సిగరేట్ తాగి కావాలనే ఇక్కడ వేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications