Flipkart బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ త్వరలోనే.. భారీ డిస్కౌంట్ల పండుగ చేస్కోండి!

అక్టోబర్ మాసంలో దీపావళి పండుగ రాబోతుంది. అక్టోబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక దీపావళి పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకునే వారి కోసం, ఇష్టమైన షాపింగ్ చేయడం కోసం flipkart తమ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 ను అధికారికంగా ప్రకటన చేసింది.

అక్టోబర్ 11వ తేదీ నుండి flipkart మెగా సేల్
అక్టోబర్ 11వ తేదీ నుండి ఈ మెగా సేల్ ప్రారంభమవుతుందని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. flipkart ప్లస్ మరియు flipkart బ్లాక్ సభ్యులకు ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 10వ తేదీ నుంచి ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో అదిరిపోయే ఆఫర్లు ఉంటాయని flipkart వెల్లడించింది.

Flipkart Big Bang Diwali Sale coming soon Celebrate the festival of huge discounts

భారీ డిస్కౌంట్లతో మెగా ఆఫర్లు
ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లతో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులు వంటి అన్ని కేటగిరీల వస్తువుల పైన భారీ డిస్కౌంట్ లు ఇవ్వనుంది. ఈ సేల్ లో యాపిల్, డెల్, ఎల్జి, రియల్ మీ, హెచ్ పీ, శాంసంగ్, వన్ ప్లస్, సోనీ, షియోమి వంటి ప్రముఖ బ్రాండ్ల పైన కస్టమర్లు అనేక ఆఫర్లను పొందవచ్చు.

ఈ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం డిస్కౌంట్
ఇక ఈ సేల్ కోసం flipkart ఎస్బిఐ కార్డుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల ఎవరైనా సరే flipkart లో ఎస్బిఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో పాటు emi లావాదేవీల పైన 10 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించింది. అంతేకాదు flipkart యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడే వారికి కూడా క్యాష్ బ్యాక్ మరియు రివార్డులు ఇవ్వనుంది.

ఫ్లిప్ కార్ట్ బ్లాక్, ఫ్లిప్ కార్ట్ ప్లస్ వాళ్ళకు ప్రోగ్రామ్ ఇలా
ఇదిలా ఉంటే ప్రస్తుతం flipkart బ్లాక్ మెంబర్షిప్ వార్షిక రుసుము 1499 రూపాయల నుండి 1249 రూపాయలకు తగ్గింది. ఇక తరచుగా కొనుగోలు చేసేవారు సూపర్ కాయిన్స్ ద్వారా flip kart ప్లస్ ప్రోగ్రామ్ ను ఉచితంగా పొందవచ్చు. అయితే ఎప్పటిలాగానే బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 ముగింపు తేదీని flipkart వెల్లడించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+