Follow: చర్చిలో లైట్లు ఆఫ్ చేసిన మహిళ, పోలో అంటూ ఫాలో చేసి విలియం ఏం చేశాడంటే ? !

బెంగళూరు: దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. ఇంటి సమీపంలోని చర్చిలో భర్త ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు భర్త చర్చిలోనే ఉంటున్నాడు. పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న క్రైస్తవులు ఆ చర్చికి వెళ్లి వస్తున్నారు. సాయంత్రం చర్చిలో లైట్లు వేసిన తరువాత భర్త ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత భార్య చర్చిలో లైట్లు ఆఫ్ చెయ్యడానికి వెళ్లింది. చర్చిలోకి వెళ్లిన మహిళను కత్తితో బెదిరించి ఆమె మీద లైంగిక దాడి చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

 చర్చిలో ఉద్యోగం చేస్తున్న భర్త

చర్చిలో ఉద్యోగం చేస్తున్న భర్త

బెంగళూరు నగరంలోని అశోక్ నగర్ లోని శాంతలానగర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు. శాంతలానగర్ లో ఓ చర్చి ఉంది. ఇదే చర్చిలో భర్త చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు.

 ఉదయం నుంచి రాత్రి వరకు ?

ఉదయం నుంచి రాత్రి వరకు ?

శాంతలా నగర్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న క్రైస్తవులు ఆ చర్చికి వెళ్లి వస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు భర్త చర్చిలోనే ఉంటున్నాడు. రాత్రి 10 గంటల తరువాత చర్చిలో లైట్లు ఆఫ్ చేసిన తరువాత భర్త సమీపంలోని ఇంటికి వెళ్లిపోయి మరుసటి రోజు ఉదయం మళ్లీ చర్చి దగ్గర పని చెయ్యడానికి వెలుతున్నాడు.

 నీరసంగా ఉందని భార్యను పంపించాడు

నీరసంగా ఉందని భార్యను పంపించాడు

ఈనెల 10వ తేదీన సాయంత్రం భర్త నీరసంగా ఉందని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అదే రోజు రాత్రి చర్చిలో లైట్లు వేసిన తరువాత భర్త సమీపంలోని ఇంటికి వెళ్లిపోయి విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి 9.30 గంటల సమయంలో చర్చిలో లైట్లు ఆఫ్ చేసి రావాలని భర్త అతని భార్యకు చెప్పాడు. భార్య ఒంటరిగా చర్చి దగ్గరకు వెళ్లింది.

 లైట్లు ఆఫ్ చేసిన వెంటనే ?

లైట్లు ఆఫ్ చేసిన వెంటనే ?

చర్చిలోకి వెళ్లిన మహిళ లైట్లు ఆఫ్ చేసి తలుపు లాక్ చెయ్యడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే మహిళను వెంబడించి చర్చి దగ్గరకు వెళ్లిన విలియం అనే వ్యక్తి ఆమెను కత్తితో బెదిరించి చర్చి లోపలికి లాక్కొని వెళ్లాడు. అరిస్తే చంపేస్తానని కత్తితో బెదిరించిన విలియం ఆమె మీద లైంగిక దాడి చేడని ఆరోపణలు ఉన్నాయి. చివరికి తప్పించుకుని పారిపోయిన మహిళ ఆమె భర్తకు విషయం చెప్పింది.

 కేటుగాడు విలియం అరెస్టు

కేటుగాడు విలియం అరెస్టు

మరుసటి రోజు భర్తను వెంటపెట్టుకుని వెళ్లిన మహిళ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో విలియం మీద కేసు పెట్టింది. శాంతలా నగర్ లోనే నివాసం ఉంటున్న విలియంను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని అశోక్ నగర్ పోలీసులు తెలిపారు. చర్చిలో మహిళను కత్తితో బెదిరించి లైంగిక దాడి చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+