రియల్ స్టోరీ: ఒంటరి యువతికి డెలివరీ బాయ్ వేధింపులు
హైదరాబాద్: బెంగుళూరులో ఉద్యోగ నిమిత్తం ఒంటరిగా ఉంటున్న ఓ యువతికి డెలివరీ బాయ్ నుంచి వచ్చిన వేధింపులు చివరకు ఆమెను నగరాన్నే విడిచేలా చేశాయి. వివరాల్లోకి వెళితే అంకిత(పేరు మార్చాం) అనే ఓ యువతి వంట చేసుకునే ఓపిక లేక మొబైల్ యాప్ ద్వారా సమీపంలోని ఓ రెస్టారెంట్ ద్వారా తనకిష్టమైన ఆహారాన్ని ఓ రెస్టారెంట్ నుంచి తెప్పించుకుంది.
ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వచ్చిన ఆ డెలివరీ బాయ్ తనకో గ్లాసు మంచినీళ్లు కావాలని అడిగడంతో అంకిత తెచ్చి ఇచ్చింది. ఆమె ఇచ్చిన గ్లాసుడు నీరు పీడకలలను మిగులుస్తుందని ఆమెకు ఆ సమయంలో తెలియదు. ఆ తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.
ఆ డెలివరీ బాయ్ అంకితకు ఫోన్ చేసి అభ్యంగా మాట్లాడటం, వేధించడం మొదలు పెట్టాడు
. దీంతో ఆ యువతి ఆ నెంబర్‌ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత మరో నెంబర్ నుంచి కాల్ చేసేవాడు. చివరకు ఆ యువతి తన నెంబర్ మార్చుకున్నా అతడి వేధింపులు మాత్రం ఆగలేదు.

ఆ డెలివరీ బాయ్ వేధింపులకు బెంగుళూరుని వదిలి వెళ్లినా ఆమెకు అతడి నుంచి లైంగిక వేధింపులు ఆగలేదని, పోలీసులకు పిర్యాదు చేసినా స్పందన లేదని వాపోతూ గురువారం అంకిత ట్విట్టర్‌లో పోస్టు చేసిన పిటిషన్‌కు విశేష స్పందన వచ్చింది.
ఆ ట్వీట్‌లో తాన గతేడాది అక్టోబర్ 10న కోరమంగళ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ నుంచి పుడ్ తెప్పించుకున్నానని, అప్పుడు 10:30 గంటల సమయంలో బాయ్ వచ్చాడని, తాను ఓ చిన్న గదిలో ఒంటరిగా ఉంటున్నట్టు తెలుసుకుని వేధింపులు మొదలు పెట్టాడని పేర్కొంది.
డెలివరీ బాయ్ వ్యవహారాన్ని రెస్టారెంట్ యజమానికి తెలియజేస్తే, అతినితో క్షమాపణలు చెప్పించి, తన స్నేహితుడి నెంబర్ అనుకుని కాల్ చేస్తున్నాడని సర్ది చెప్పారని, ఆ తర్వాత కూడా మిస్డ్ కాల్స్, వేధింపులు, అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆమె వాపోయింది.
తనకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడల్లా 3-4 యువకులు కామెంట్లు చేస్తూ, నవ్వుకుంటున్నట్టు వినిపిస్తుండేదని తెలిపింది. ఒక రాత్రిలో తాను 4-5 నెంబర్లను బ్లాక్ చేశానని, అయినా సరే కొత్త నెంబర్ల నుంచి తనకు వేధింపులు మొదలయ్యేవని వివరించింది.
ఈ సంఘటన జరిగి సంవత్సరం గడుస్తున్నా తనకు ఈ వేధింపులు మాత్రం ఆగలేదని వాపోయింది. డెలివరీ బాయ్ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని నెలల క్రితం బెంగుళూరు నుంచి వెళ్లినా తనకు ఈ మంగళవారం తెల్లవారుజామున 2.25 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని ఆమె పేర్కొంది.
అంకిత ట్విట్టర్ పోస్టు అనంతరం ఆమెకు సంఘీభావంగా వేలాది మంది నిలవడంతో, ఓ సీనియర్ పోలీసు అధికారి ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. తాను బ్లాక్ చేసిన నెంబర్లను అడిగి మరీ తీసుకున్నారు. మరికొంత మంది సీనియర్ పోలీసు అధికారులు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
#3Novices: Food delivery boy's constant, harassing calls force woman to leave Bengaluru On a day when she was too lazy to cook, Ankita orde…
— 3Novices Bangalore (@3NovicesBglr) November 12, 2015 Undeterred, the next day itself, the boy made a flood of calls to Ankita from random number https://t.co/D0nJRvEdA4
— Sanju Paison (@cooloften) November 12, 2015 











Click it and Unblock the Notifications