స్విగ్గీలో కొత్త సర్వీస్ వచ్చిందా..? ఫుడ్‌తోపాటు ‘మందు’ డెలివరీ చేస్తోందా..?
అహ్మదాబాద్: సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని ఆహార ప్రియులకు ఫుడ్ అందిస్తుంటారని మనకు తెలుసు. కానీ, ఇక్కడ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం ఫుడ్ తోపాటు మద్యం కూడా అందిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

స్విగ్గీనే మద్యం కూడానా?
స్విగ్గీలో ఫుడ్ డెలివరి బాయ్‌గా పనిచేస్తూనే మద్యం కూడా ఇతను డెలివరీ చేస్తుండటం గమనార్హం. దీంతో వినియోగదారుల్లో స్విగ్గీనే మద్యం కూడా డెలివరీని ప్రారంభించిందా? అనే సందేహం కలిగింది. చివరకు అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది.

అప్పులు చేసి పార్టీలు..
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన రాహుల్ మహిదా అనే 25ఏళ్ల యువకుడు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో గత ఏడు నెలలుగా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు నెలల క్రితం వివాహమైంది. వివాహం సందర్భంగా అప్పులు చేసి మరీ స్నేహితులతో పార్టీలు చేసుకున్నాడు ఈ యువకుడు.

ఫుడ్ తోపాటు మద్యం..
పెళ్లి తర్వాత ఖర్చులు, అప్పులు పెరిగిపోవడంతో ఏదైనా సైడ్ బిజినెస్ చేయాలనుకున్నాడు. ఎక్కువ డబ్బులు వస్తాయి కాదా అని.. ఫుడ్ డెలివరీతోపాటు మద్యాన్ని కూడా ఇంటింటికీ అందించడం మొదలుపెట్టాడు. డబ్బులు బాగానే రావడంతో అదే కొనసాగించాడు. 20రోజులపాటు ఇలానే చేశాడు.

చివరకు కటకటాలపాలు
అయితే, కొందరు వినియోగదారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై నిఘా పెట్టిన పోలీసులు.. గత ఆదివారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు. రూ. 600 విలువైన ఆరు బీరు బాటిళ్లు, రూ. 7వేల విలువ చేసే ఒక స్మార్ట్ ఫోన్, రూ. 40వేల డబ్బును రాహుల్ వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications