ఫోర్బ్స్ 2023 జాబితా: ఐదోసారి ప్రపంచ శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్!!

2023 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా ఐదవ సారి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మల సీతారామన్ మరోమారు చోటు సంపాదించారు.

భారతదేశంలో నలుగురికి ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. గత ఏడాది మొత్తం ఆరుగురికి స్థానం దక్కింది. అయితే 2023 శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మల సీతారామన్ ముందు వరుసలో నిలిచారు. నిర్మల సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకోవడం ఇది వరుసగా ఐదవ సారి. ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మల సీతారామన్ 32వ స్థానాన్ని దక్కించుకున్నారు.

 Forbes 2023 list: Nirmala Sitharaman world powerful women for the fifth time in a row!

గత సంవత్సరం ఆమె 36వ స్థానంలో ఉండగా, గతేడాది కంటే మరింత మెరుగైన స్థానాన్ని ఈసారి పొందారు. నిర్మల సీతారామన్ తర్వాత భారతదేశం నుంచి హెచ్సీఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా 60వ స్థానంలో నిలిచారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సోమ మోండల్ 70వ స్థానంలోనూ, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 76 వ స్థానంలోనూ చోటు దక్కించుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయన్ తొలి స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్ ఉన్నారు. మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ ఉన్నారు.

గతేడాది జాబితాలో నైకా వ్యవస్థాపకులు ఫల్గుణి నాయర్, సెబి చైర్ పర్సన్ మదాభి పురి బచ్ ఉండగా ఈ సంవత్సరం వారు ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకోలేదు. పరపతి, మీడియా, ప్రభావం, మరియు ప్రభావిత రంగాలు ఆధారంగా, వీటిని కొలమానంగా తీసుకొని ఫోర్బ్స్ జాబితా రూపొందించి ప్రతీ సంవత్సరం వెల్లడిస్తుంది, ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా జాబితా వెల్లడించింది.

ఇక ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ స్థానం దక్కించుకోవటంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఫోర్బ్స్ యొక్క వార్షిక జాబితా అయిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారన్నారు.ఆమె రాజకీయాలు, విధానపర నిర్ణయాలు భారతీయ ఆర్థిక రంగానికి చాలా ముఖ్యమైనవని, ప్రశంసనీయమైనవని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+