ఫోర్బ్స్ 2025 భారత కుబేరుల జాబితా.. ముకేష్ అంబానీ ఏ స్థానంలో ఉన్నారంటే!
భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశంలోని అపరకుబేరుడు ముఖేష్ అంబానీ మరో మరో అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన నికర సంపద 105 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే మాత్రం ఈ సంపద విలువ 12 శాతం తగ్గిందని ఫోర్బ్స్ జాబితా వెల్లడించింది.
రెండో స్థానంలో గౌతమ్ అదానీ
భారత దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో రెండవ స్థానంలో 92 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ నిలిచారు. అత్యంత ధనవంతుల జాబితాలో మూడవ స్థానంలో ఏపీ జిందాల్ గ్రూప్ కి చెందిన సావిత్రి జిందాల్ నిలిచారు. ఈ జాబితాలో దేశంలోనే సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ నిలిచింది. ఆమె 40 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచింది.గతేడాదితో పోలిస్తే సావిత్రి జిందాల్ సంపద 3.5 బిలియన్ డాలర్లు తగ్గింది.

అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్
సావిత్రి జిందాల్ సంపద తగ్గినప్పటికీ భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ కొనసాగుతున్నారు. టెలికాం దిగ్గజమైన సునీల్ మిట్టల్ నాలుగవ స్థానంలో, టెక్ బిలియనీర్ అయిన శివ నాడార్ ఐదవ స్థానంలో నిలిచారు. వివిధ మార్గాల ద్వారా సంపాదించిన సమాచార ఆధారంగా ఈ సంపద అంచనాలను రూపొందించినట్టు ఫోర్బ్స్ తెలిపింది.
ఈ సంవత్సరం తగ్గిన కుబేరుల సంపద విలువ
2025 సంవత్సరంలో దేశంలోని వంద మంది అగ్రశ్రేణి కుబేరుల మొత్తం సంపద విలువ 9 శాతం తగ్గి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి బలహీనపడటం ఈ క్షీణతకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈసారి అందరి సంపద తగ్గినా టాప్ మాత్రం ముకేష్ అంబానీనే నిలిచారు.
ఫోర్బ్స్ జాబితాలో అధినేత ముఖేష్ అంబానీ టాప్
ఈ సంపన్నుల జాబితాను తయారు చేయడానికి ఆయా సంస్థలు షేర్ల విలువను, వ్యక్తులు మరియు కుటుంబాల ఆర్థిక వివరాలను, స్టాక్ ఎక్స్చేంజి లలో పరిస్థితిని, నియంత్రణ సంస్థల నుంచి లభించిన సమాచారాలను ఇందులో భాగంగా తీసుకుంటారు. దీని ఆధారంగా సంపన్నుల జాబితాను తయారు చేస్తారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా ఫోర్బ్స్ జాబితాలో అధినేత ముఖేష్ అంబానీ టాప్ పొజిషన్లో నిలిచారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications