'ఇవి రైళ్లు కావు'.. ఇండియన్ రైల్వేస్ పై విదేశీ కపుల్ సంచలనం..!

విదేశాలకు చెందిన ట్రావెల్ కపుల్ క్రిస్, ఫ్లో.. ఇండియన్ రైల్వేస్ పై తమ అభిప్రాయాన్ని తెలిపారు. వివిధ దేశాల్లో టూర్స్ చేసే ఈ జంట భారత్ కు ఇటీవల వచ్చింది. భారత్ లోని రైళ్లలో ప్రయాణించింది. జైపుర్ నుంచి ఆగ్రా వరకు రైళ్లో ట్రావెల్ చేసింది. వీళ్లు టికెట్ కోసం ఒక్కొక్కరికి 28 డాలర్లు ఖర్చు చేశారు. ఫస్ట్ క్లాస్(1AC) బోగీలో ప్రయాణించారు. ఇంత విశాలంగా ఉంటాయని అనుకోలేదని తెలిపింది ఈ జంట. వసతులు, సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. భారత్ లో ట్రైన్ జర్నీ ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించ లేదని తమ ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు.

ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్సర్స్ గా పేరు గాంచిన జంట క్రిస్, ఫ్లో.. ఇప్పటివరకు 35 దేశాల్లో పర్యటించారు. ఇటీవల భారత్ లోనూ ట్రావెల్ చేశారు. ఇటీవల జైపుర్ నుంచి ఆగ్రా వరకు ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించారు. అయితే ఈ రైలులో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని.. ఇలా ఉంటాయని అసలు ఊహించలేదని తెలిపారు. కంపార్ట్ మెంట్స్, బెడ్ లు చాలా విశాలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇన్ స్టా లో పోస్టు చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Foreign Couple Praises Indian Railways First-Class Comfort

ట్రైన్ టికెట్ ఒక్కొక్కరికి 28 డాలర్లు ఉంది అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 2,483.. అని ఈ జంట పేర్కొంది. ఈ పోస్టుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్సర్లు లైక్స్ చేశారు. ఏదోరోజు తాము కూడా భారత్ లో ఇలాంటి జర్నీ ని కోరుకుంటున్నామని కామెంట్స్ పెట్టారు. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో వసతుల గురించి వివరించారు. క్యాబిన్ చాలా విశాలంగా ఉంది. రెండు బెడ్స్ ఉన్నాయి. అద్దం ఉంది. బ్యాగ్స్ ఇతర లగేజీ పెట్టుకోవడానికి స్థలం ఉంది. క్యాబిన్ కు ఓ కిటికీ ఉంటుంది. దానికి కర్టెన్ కూడా ఉంది.. అని ఈ జంట చెప్పుకొచ్చింది. ఇవి రైళ్లలా లేవు అని ఇంట్లో ఉన్న సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో భారత రైళ్లపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+