ఎవ్వరూ చిక్కలేదని లేడీ ఐపీఎస్ ను గోకిన మాజీ డీజీపీ, దెబ్బకు చిప్పకూడు !

చెన్నై: ఉన్నత స్థాయి ఉద్యోగం అడ్డం పెట్టుకుని సాటి మహిళా ఉద్యోగులతో గేమ్స్ అడితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ కేసు వివరాలు తెలుసుకుంటే అర్థం అవుతోంది. మహిళా పోలీసు అధికారిణిని లైంగికంగా వేధించిన కేసులో తమిళనాడు మాజీ డీజీపీ రాజేష్ దాస్ దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. లైంగిక వేధింపుల కేసులో సస్పెన్షన్‌కు గురైన ఓ అధికారికి తమిళనాడులోని విల్లుపురం కోర్టు జైలు శిక్ష విధించింది.

ఫిబ్రవరి 2021లో ఒక మహిళా ఐపీఎస్ అధికారిని ఆమె సీనియర్ ఐపీఎస్ అధికారిపై ఫిర్యాదు చేశారు.అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి భద్రతా విధులు చూసుకుంటున్న డీజీపీ రాజేష్ దాస్ ఆయన విధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రయాణిస్తున్నప్పుడు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారినిని డీజేపీ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

తన మీద డీజేపీ రాజేష్ దాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా ఐపీఎస్ అధికారి అప్పట్లో ఆరోపించారు. దీని తర్వాత అప్పటి ఏఐఏడీఎంకే ప్రభుత్వం సీనియర్ పోలీసు అధికారి రాజేష్ దాస్‌ను సర్వీసు నుంచి సస్పెండ్ చేసింది. అలాగే ఈ కేసును విచారించేందుకు అప్పటి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

dgprajeshdas

ఈ కేసులో పోలీసు సిబ్బంది సహా 68 మంది వాంగ్మూలాన్ని ప్రాసిక్యూషన్ నమోదు చేసింది. ప్రస్తుతం కోర్టు జైలుశిక్ష విధించడంతో రాజేష్ దాస్ పై కోర్టులో అప్పీలు చేసుకొని బెయిల్ పొందే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ టీమ్ సభ్యుడు ఒకరు తెలిపారు. డీజీపీ రాజేష్ దాస్ లైంగిక వేధింపుల కేసు 2021లో తమిళనాడు రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. ఇదే అంశంపై అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే ప్రజల్లోకి వెళ్లారు.

అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ మా డీఎంకే పార్టీ అధికారంలోకి తీసుకువస్తే, రాష్ట్రంలో చట్టబద్ధమైన ప్రక్రియతో మాజీ డీజీపీ రాజేష్ దాస్ ను శిక్షిస్తామని బహిరంగంగానే హామీ ఇచ్చారు. మాజీ డీజీపీ రాజేష్ దాస్ మీద అప్పట్లో ఎంకే. స్టాలిన్ తో పాటు డీఎంకే పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శించారు. ఇప్పుడు మాజీ డీజీపీ రాజేష్ దాస్ కు నిజంగానే జైలు శిక్షపడింది.

అయితే ఇప్పుడు మాజీ డీజీపీ మహిళా ఐపీఎస్ అధికారిని లైంగిక వేధింపులకు గురి చేశాడని కోర్టులో నేరం రుజువు కావడంతో ఆయనకు జైలు శిక్షపడింది. మహిళా ఐపీఎస్ అధికారి మీద లైంగిక వేధింపులు చేశారని నమోదు అయిన కేసులో మాజీ డీజీపీకి జైలు శిక్ష పడటం తమిళనాడు చరిత్రలో ఇదే మొదటిసారి అని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+