అమెరికన్ కంపెనీలో చేరిన ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ సందీప్

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఇటీవల గుడ్‌బై చెప్పిన సందీప్‌ దద్లానీ త్వరలో అమెరికాకు చెందిన ప్రముఖ చిరుతిళ్ల తయారీ సంస్థ మార్స్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ కంపెనీలో చేరుతున్నారు. స్నికర్స్‌, మిల్కీవే, మార్స్‌ డ్రింక్స్‌ లాంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది మార్స్ కంపెనీ.

కాగా, సందీప్‌ ఆ కంపెనీలో చీఫ్‌ డిజిటల్‌ అధికారిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు మార్స్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

గతంలో ఇన్ఫోసిస్‌‌లో ప్రెసిడెంట్‌, అమెరికా హెడ్‌గా పనిచేశారు సందీప్‌. ఇటీవలే ఆయన ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగారు. వ్యక్తిగత అభిరుచుల్లో చేరేందుకే తాను ఇన్ఫోసిస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు సందీప్‌ లింక్డ్‌ఇన్‌లో వెల్లడించారు.

ఇప్పుడు ఆయన న్యూజెర్సీలోని మార్స్‌లో చేరుతున్నారు. ఈ సంస్థ స్నికర్స్‌, మిల్కీ వే లాంటి ఛాక్లెట్లతో పాటు, శీతల పానియాలు, పెడీగ్రీ లాంటి ఉత్పత్తులను కూడా తయారుచేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sandeep Dadlani, former president and head of Americas for Infosys, will join global food giant Mars. Mr Dadlani will take up the role of chief digital officer at Mars.
Please Wait while comments are loading...