దేవుడు వరమందిస్తే ?, బెంగళూరు లీడర్ కు బిగ్ రిలీఫ్, ఆస్తుల్లో 2 వేల శాతం తేడానా?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ అలియాస్ జమీర్ అహమ్మద్ ఊపిరిపీల్చుకున్నారు. ఆదాయానికి మించిన అక్రమాస్తులు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ మీద నమోదు అయిన కేసు విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది.
ఇంతకాలం లోకాయుక్త పోలీసుల విచారణతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు. బెంగళూరులోని చామరాజపేట్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి జమీర్ అహమ్మద్ ఖాన్ మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జమీర్ అహమ్మద్ ఖాన్ చాలా బిజీగా ఉన్నారు.

తనకు రూ. 87.5 కోట్ల ఆస్తి ఉందని జమీర్ అహమ్మద్ ఖాన్ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ ఆయన అధికారికంగా వెళ్లడించిన ఆస్తికంటే సుమారు 2, 031 శాతం ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ 2022లో కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు.
అక్రమాస్తులు సంపాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ మీద కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు విచారణ చేస్తున్నారు. తన మీద లోకాయుక్త అధికారులు నమోదు చేసిన కేసు దర్యాప్తు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
జమీర్ అహమ్మద్ ఖాన్ మీద నమోదు అయిన కేసు దర్యాప్తుకు స్టే ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు ఏప్రిల్ 6వ తేదీన నిరాకరించింది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో జమీర్ అహమ్మద్ ఖాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ జమీర్ అహమ్మద్ ఖాన్ తరుపున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.
కేసు వివరాలు తెలుసుకున్న సుప్రీం కోర్టులోని ద్విసభ్య బెంచ్ న్యాయమూర్తులు జమీర్ అహమ్మద్ ఖాన్ మీద నమోదు అయిన కేసు దర్యాప్తును రెండు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోకాయుక్త పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో ముందుజాగ్రత్త చర్యగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications