రోజుకు ముగ్గురు లేడీస్ జీవితం నాశనం, మాజీ ప్రధాని ఫ్యామిలీలో ఖర్మకాండ, నా శాపం తగిలింది !
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసు రోజురోజుకు మలుపు తిరుగుతుండటంతో ప్రజ్వల్ రేవణ్ణపై ఆగ్రహావేశాలు వెళ్లువెత్తాయి. దీనిపై మాజీ ఎంపీ ఎల్‌ఆర్ శివరామేగౌడ మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సెక్స్ స్యాండల్ కింగ్ పిన్ ప్రజ్వల్ రేవణ్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మండ్యలో మాట్లాడిన మాజీ ఎంపీ శివరామేగౌడ ఎన్డీయే నుంచి జేడీఎస్ పార్టీని బయటకు పంపించాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కోరారు. లోక్ సభ ఎన్నికలు జరగుతున్న సమయంలో ఆ ఎన్నికల ప్రచారం కంటే ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ కేసు ఎక్కువ హాట్ టాపిక్ అయ్యిందని మాజీ ఎంపీ శివరామేగౌడ ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు గురించి ప్రజలు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు.

బ్లూ ఫిల్మ్ మేకర్స్ వద్ద అలాంటి వీడియో ఉందో లేదో తనకు తెలియదని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దగ్గర మాత్రం అంతకు మించిన వీడియోలు ఉన్నాయని మాజీ ఎంపీ శివరామేగౌడ ఆరోపించారు. ఈ వయసులో ఇలాంటి నీచమైన పనిని చూసే దౌర్భాగ్యం మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడకు కలిగిందని, ఆయన్ను చూస్తుంటే ఓ రకంగా తనకు బాదగా ఉందని మాజీ ఎంపీ శివరామేగౌడ అన్నారు.
నాతో పాటు చాలా మందిని ఫినిష్ చేసిన జేడీఎస్ కంపెనీ ఇప్పుడు తగిన ఫలితం అనుభవిస్తోందని శివరామేగౌడ ఆరోపించారు. గంగాధర్ హత్య కేసులో నన్ను ఇరికించేందుకు మాజీ ప్రధాని దేవెగౌడ 8 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఆరోజు తాను అనుభవించిన క్షోభకు, నా శాపం నేడు వీళ్లకు తగిలిందని శివరామేగౌడ అన్నారు. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చేసిన నీచమైన పనికి మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సిగ్గుపడుతున్నారని శివరామేగౌడ అన్నారు.

ఐదేళ్లుగా ఎంపీగా ప్రజల్ రేవణ్ణ రోజుకు ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి దౌర్జన్యం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారని మాజీ ఎంపీ ఎల్ ఆర్ శివరామేగౌడ ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణ కుటుంబం వల్ల అన్యాయానికి గురైన బాధితుల జాబితాలో నేను కూడా ఉన్నానని మాజీ ఎంపీ శివరామేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి హాసన్‌కు వెళ్లి బాధితులకు న్యాయం చేయాలని శివరామేగౌడ డిమాండ్ చేశారు.
మీ కుటుంబం నుండి అన్యాయం జరిగింది కాబట్టి ఇక ముందు మీ బెదిరింపులు ఆపండి అని మాజీ సీఎం కుమారస్వామికి సూచించారు. హాసన్ డీసీపై మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. ఎవరూచేయని నీచమైన నేరం చేసిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, మాజీ మంత్రి రేవణ్ణలను కూడా అరెస్ట్ చేయాలని, తండ్రీకొడుకులిద్దరూ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని మాజీ ఎంపీ శివరామేగౌడ ప్రజ్వల్ రేవణ్ణ కుటుంబ సభ్యులను నిలదీశారు.












Click it and Unblock the Notifications