• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీటూ ఉద్యమం: నలుగురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సెలబ్రిటీ కన్సల్టెంట్ సుహేల్ సేథ్‌

|

ఢిల్లీ: మీ టూ ఉద్యమం ఊపందుకుంటోంది. తమపై జరిగిన లైంగిక దాడుల గురించి మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సోషల్ మీడియా వేదికగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను పంచుకుంటున్నారు. తమకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించిన చాలామంది సమాజంలో పేరున్న పెద్దల పేర్లు బయటపెడుతున్నారు. తనుశ్రీ దత్తాతో మళ్లీ మొదలైన మీ టూ ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ కన్సల్టెంట్ సుహెల్ సేథ్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు వచ్చాయి. నలుగురు మహిళలు సుహెల్ సేథ్ పై లైంగిక ఆరోపణలు చేశారు. వీరిలో ఒకరు మైనర్‌గా ఉన్న సమయంలోనే సేథ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పింది.

మీటూ ఎఫెక్ట్: ఆ సినిమా నుండి తప్పుకున్న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్!

 నా గొంతు కింది భాగంలో నాలుకతో ముట్టేందుకు ట్రై చేశాడు: నటాష్‌జా రాథోడ్

నా గొంతు కింది భాగంలో నాలుకతో ముట్టేందుకు ట్రై చేశాడు: నటాష్‌జా రాథోడ్

ఇక బుధవారం మధ్యాహ్నం ఫిల్మ్ మేకర్ నటాష్‌జా రాథోడ్ వాట్సాప్ మెసేజ్‌ స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. ఏడాది క్రితం సుహేల్ సేథ్ తన గురుగ్రామ్‌లోని తన నివాసానికి రావాలంటూ చేసిన వాట్సాప్‌ మెసేజ్‌లను ఆమె బహిర్గతం చేశారు. అందుకు కౌంటర్‌గా ఆమె వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్‌ను బహిర్గతం చేసింది. అది ఇలా ఉంది. "నా గొంతు భాగంలో నీ నాలుకతో ముట్టేందుకు ప్రయత్నించావు. అప్పటికీ నేను ప్రతిఘటిస్తున్నాను. నా కుర్తాలోకి నీ చేతిని దోపి నా వక్షోజాలను తాకే ప్రయత్నం చేశావు. ఆ సమయంలో నేను నీ చేతిపై కొట్టి అక్కడి నుంచి బయటకు లాగేసినట్లు నాకు గుర్తు." అనే మెసేజ్ టైప్ చేసి సుహేల్ సేథ్ కు పంపింది.

ఐస్ క్రీమ్ తిందామంటూ..తన ఇంటికి తీసుకెళ్లాడు

ఐస్ క్రీమ్ తిందామంటూ..తన ఇంటికి తీసుకెళ్లాడు

"సుహేల్ సేథ్‌ను ఒక పార్టీలో కలిశాను. నా బాస్ తనను పలకరించాల్సిందిగా పురుమాయించాడు. ఐస్ క్రీమ్ తినేందుకు జనపత్‌కు రావాల్సిందిగా పిలిచాడు. నేను ఇందుకు అంగీకరించలేదు. కానీ బలవంతం చేయడంతో నేను ఆయన కారులో కూర్చున్నాను. అయితే జనపత్‌కు తాను తీసుకెళ్లలేదు. తన ఇంటికి తీసుకెళ్లాడు. " అని వెల్లడించింది."చాలా సార్లు ఎలా నీ నుంచి తప్పించుకోవాలో నేర్చుకున్నాను. అయితే లైంగిక వేధింపులు పాల్పడే వారి వద్ద ఏ మహిళ తప్పించుకునేందుకు ప్రయత్నించకూడదు. వెంటనే తిరగబడాలి"అని ఆమె అన్నారు.

నా నోటిపై ముద్దు పెట్టాడు.. అతని నాలుక నా నోట్లోకి వెళ్లింది

నా నోటిపై ముద్దు పెట్టాడు.. అతని నాలుక నా నోట్లోకి వెళ్లింది

ఇక మందాకిని గెహ్లాట్ అనే మహిళా జర్నలిస్టు కూడా సుహేల్ సేథ్ పై లైంగిక ఆరోపణలు చేసింది. గోవాలో ఓ సదస్సు జరిగిన తర్వాత అందరూ వెళ్లే సమయంలో ఒక హగ్ ఇస్తున్నారని... సుహేల్ సేథ్ మాత్రం తనను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టాడని అతని నాలుక తన నోట్లోకి వెళ్లిందని చెప్పుకొచ్చింది. అప్పుడే అలా ప్రవర్తించడం తప్పు అని సుహేల్‌కు చెప్పినట్లు మహిళా జర్నలిస్టు వెల్లడించింది. అయితే జరిగిన ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆ సమయంలో తను కెరీర్‌లో స్థిరపడుతున్న కారణంగా అక్కడితో వదిలేసినట్లు చెప్పారు. మరో మహిళ తాను 17 ఏళ్ల వయసున్న సమయంలో తనకు అసభ్యకర మెసేజ్‌లు సుహేల్ సేథ్ పంపించారని వెల్లడించింది. ఇది 2010లో జరిగిందని ఆమె చెప్పారు. అంతేకాదు తనను గదికి రావాల్సిందిగా మెసేజ్ పంపారని ఆ మెసేజ్‌ను తన తల్లికి చూపించగా తనను డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేయమని తన తల్లి చెప్పినట్లు ఆ యువతి తెలిపింది.

తరుచూ గదికి రమ్మని పిలిచేవాడు

తరుచూ గదికి రమ్మని పిలిచేవాడు

ముంబైలోని మరో యువతి సుహేల్ సేథ్‌ను ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో కలిసినట్లు చెప్పింది.తన తండ్రితో పాటు సుహేల్ సేథ్ ను ఢిల్లీలో కలిసినట్లు చెప్పిన యువతి... అప్పుడు తాను పలకరించగా చాలా బాగా మాట్లాడారని వెల్లడించింది. ఆ తర్వాత తమ మధ్య మాటలు సెక్స్, ఆన్‌లైన్ డేటింగ్ వరకు వెళ్లాయని పేర్కొంది. అనంతరం చిన్నగా సుహేల్ సేథ్ తన నడుం చుట్టూ చేతులు వేశాడని వివరించింది. ఆ తర్వాత ముంబైకి తాను వస్తున్నట్లు మెసేజ్ చేసి తను నివాసం ఉండే గదికి రావాలని పదే పదే మెసేజ్‌లు చేసేవాడని పేర్కొంది. ఏదో తేడాగా వ్యవహారం కనిపించడంతో తను సుహేల్ సేథ్ గదికి వెళ్లలేదని స్పష్టం చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Celebrity consultant Suhel Seth is the latest name on the growing list of men who stand accused of sexual harassment by women in the #MeToo movement sweeping Indian media, film and entertainment. At least four women, including one who said she was a minor at the time of the alleged incident, have accused Seth, 55, of sexual harassment — two of them have made specific allegations of sexual assault.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more