మెంతికూర కట్ట రూ.600. రేటు చూసి మహిళ షాక్

భారతదేశంలో మెంతి కూర కట్ట అంటే కేవలం పది రూపాయలు.. మహా అయితే ఇరవై రూపాయలు. కానీ అమెరికాలో ఉన్న భారతీయులకు మాత్రం అది అక్షరాలా ఒక లగ్జరీ ఐటమ్‌లా మారిపోయింది. ఇటీవలే ఒక భారతీయ మహిళ అమెరికాలోని ఓ సూపర్ మార్కెట్‌లో మెంతి కూర కొన్న అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కడ ఒక చిన్న మెంతి కూర కట్ట ధర ఏకంగా 7 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 600) ఉండటాన్ని చూసి ఆమె అవాక్కయ్యారు.

నెటిజన్ల మధ్య మొదలైన 'ప్రైస్ వార్'..

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. కొందరు ఈ రేట్ల వ్యత్యాసాన్ని చూసి ఆశ్చర్యపోతుంటే, మరికొందరు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. "డాలర్లలో సంపాదిస్తూ.. రూపాయల్లో లెక్కలు వేయడం ఏంటి?" అని కొందరు ప్రశ్నిస్తుంటే.. "ఇంత ధర పెట్టి మెంతి కూర కొనడం కంటే ఇండియాకు వచ్చేయడం మంచిది" అని మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు.

From Rs 10 to Rs 600 NRI Woman s Viral Video Reveals Shocking Price of Fenugreek Leaves in United States

fenugreek: అంత ధర ఎందుకు?

భారత్‌తో పోలిస్తే అమెరికాలో ఆకుకూరల ధరలు ఇంత భారీగా ఉండటానికి ప్రధాన కారణాలు ఉన్నాయి:

  • రవాణా - నిల్వ: మెంతి కూర వంటి ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి. వాటిని ఫామ్ హౌస్‌ల నుండి సూపర్ మార్కెట్లకు తరలించడానికి కోల్డ్ స్టోరేజ్- ప్రత్యేక రవాణా సౌకర్యాలు అవసరం.
  • ప్యాకేజింగ్: అమెరికాలో ప్రతి వస్తువును శుభ్రం చేసి, ప్యాకేజింగ్ చేసి విక్రయిస్తారు. దీనికి అయ్యే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ.
  • డిమాండ్ - సరఫరా: భారత్‌లో మెంతి కూర విరివిగా పండుతుంది. కానీ అమెరికాలో ఇది కేవలం భారతీయులు లేదా ఏషియన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. డిమాండ్ తక్కువగా ఉండి, రవాణా ఖర్చు పెరగడం వల్ల రేట్లు ఇలా ఆకాశాన్ని తాకుతున్నాయి.

పర్చేజింగ్ పవర్ పారటీ (PPP)

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికాలో సగటున ఒక వ్యక్తి గంటకు సంపాదించే వేతనం భారత్‌లో ఒక రోజు వేతనంతో సమానం. కాబట్టి అక్కడ 7 డాలర్లు అనేది వారి సంపాదనతో పోలిస్తే భారత్‌లో 10 రూపాయల ఖర్చుతో సమానమని కొందరు లాజిక్ తీస్తున్నారు. ఏది ఏమైనా, రూపాయల్లోకి కన్వర్ట్ చేసి చూస్తే మాత్రం.. ఆ మెంతి పప్పు చాలా కాస్ట్లీ గురూ అనిపించక మానదు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+