లక్ష వ్యూస్: వరుడి ఫన్నీ డ్యాన్స్, చివరకు వధువు కూడా(వీడియో)
ఓ పెళ్లి వేడుకలో వరుడు చేసిన నృత్యం ఇప్పుడు యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వ్యూస్ లక్ష దాటడం విశేషం. ఆ పెళ్లి వేడుకలో పక్కనే వధువు ఉండగా.. వరుడు మాత్రం రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు.
న్యూఢిల్లీ: ఓ పెళ్లి వేడుకలో వరుడు చేసిన నృత్యం ఇప్పుడు యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వ్యూస్ లక్ష దాటడం విశేషం. ఆ పెళ్లి వేడుకలో పక్కనే వధువు ఉండగా.. వరుడు మాత్రం రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు.
అతని డ్యాన్స్ కూడా నవ్వు పుట్టించేదిగా ఉండటం గమనార్హం. కాసేపు చిందులేసిన వరుడు.. వధువును కూడా తనతోపాటు డ్యాన్స్ చేయాల్సిందిగా కోరాడు. అయితే, ఆమె ముందుకు రాకపోవడంతో అతనొక్కడే చిందులు వేస్తే ఎంజాయ్ చేశాడు.
కాగా, అక్కడున్న బందువులు డబ్బులు చల్లుతూ అతడ్ని ప్రోత్సహించారు. చివరకు కొందరు యువతులు వచ్చి బలవంతం చేయడంతో వధువు కూడా వరుడితో కలిసి చిందులేసింది. ఈ పెళ్లి వేడుక ఎక్కడ జరిగిందో సరిగ్గా తెలియదు కానీ, ఉత్తర భారతదేశంలోని ఏదో రాష్ట్రంలో జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications