వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి కుమార్తె పెళ్లి రోజు హైలెట్ సీన్స్ ఇవే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహం వైభవంగా చేయడానికి నిర్ణయించారని ఆయన వర్గీయులు అంటున్నారు. గాలి కుమార్తె పెళ్లిలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఆడిపాడనున్నారని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

<strong>గాలి కుమార్తె పెళ్లి 11 రోజులు: ఎస్ఆర్ కే, కత్రినా డ్యాన్స్ !</strong>గాలి కుమార్తె పెళ్లి 11 రోజులు: ఎస్ఆర్ కే, కత్రినా డ్యాన్స్ !

షారుక్ ఖాన్, కత్రినా ఖైఫ్, ప్రభుదేవా, తమన్నాతదితరుల డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమాలపై ఇప్పటి వరకు గాలి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

పెళ్లి వేడుకలకు వచ్చిన వారికి ఈ కార్యక్రమాలతో అలరించాలని చూస్తున్నారని, అందుకే గొప్యంగా ఉంచారని అంటున్నారు. తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లి వెడ్డింగ్ కార్డుతో ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి అందరిని ఆకర్షించారు.

<strong>గాలికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ?: టపాల్</strong>గాలికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ?: టపాల్

Gali Janardhan Reddy daughter’s wedding: Shah Rukh, Katrina, Prabhu Deva, Tamanna to perform?

ఇప్పుడు ప్రముఖులను ఆహ్వానించడానికి గాలి జనార్దన్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. సినీ ప్రముఖులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలను గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా ఆహ్వానిస్తున్నారు.

ఆ లిస్టులో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అనంతకుమార్, సదానందగౌడ తదితర బీజేపీ నాయకులు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సైతం గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లికి ఆహ్వానిస్తారని సమాచారం.

ఇటీవల బహుబాష నటుడు, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇంటికి వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. ఉపేంద్ర, ఆయన సతీమణి, సినీనటి ప్రియాంక ఉపేంద్ర పెళ్లికి తప్పకుండా వస్తామని గాలికి హామీ ఇచ్చారని సమాచారం.

అంతే కాకుండా కన్నడ క్రేజీస్టార్, దర్శకుడు, నిర్మాత వి. రవిచంద్రన్, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్ కుమార్ తదితర కన్నడ సినీ ప్రముఖులను గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా కలుసుకుని తన కుమార్తె పెళ్లికి వచ్చి ఆశిర్వధించాలని మనవి చేశారు.

<strong>గాలి కుమార్తె పెళ్లి వేడుకలు: అధికారుల నిఘా ?</strong>గాలి కుమార్తె పెళ్లి వేడుకలు: అధికారుల నిఘా ?

నవంబర్ 16వ తేదీన బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో గాలి జనార్దన రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పాణ్యం విక్రమ్ దేవా రెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డితో జరగనుంది.

బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో భారీ ఖర్చుతో పెళ్లికి భారీ సెట్టింగ్స్, లైటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. సినీ రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్లు దగ్గరుండి సెట్టింగ్స్ వేయిస్తున్నారని తెలిసింది.

గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి వెడ్డింగ్ కార్డులకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని వార్తలు వచ్చాయి. వెడ్డింగ్ కార్డులకే ఇంత డబ్బు ఖర్చు పెడితే ఇక పెళ్లికి ఏ స్థాయిలో ఖర్చు చేస్తారు అని ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుంటున్నారు.

English summary
The BJP leader has also invited several celebs from the Kannada and Telugu film industries. Some photos featuring Janardhan Reddy giving invitations to Upendra, Ravichandran and Parvathamma Rajkumar have gone viral on the social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X