రెడ్డి మాస్టర్ ప్లాన్ కు బీజేపీకి మైండ్ బ్లాక్,క్లోజ్ ఫ్రెండ్ మీద రివైంజ్?,రెడ్డి సొంత పార్టీ లీడర్స్ రివర్స్!
బళ్లారి లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బళ్లారిలో ఎన్నడూ లేని విధంగా అప్పుడే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెరలేపింది. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఏ పార్టీ అభ్యర్థిని ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా కేంద్రం అయిన బళ్లారిలో ఆంధ్రా పాలిటిక్స్ ను తలతన్నే రీతిలో లోక్ సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి.
బళ్లారి పేరుకు మాత్రమే కర్ణాటకలో ఉన్నా అక్కడ ఎక్కువ శాతం మాట్లాడే బాష తెలుగు. బళ్లారిలో రాయలసీమ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతానని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి చెప్పడంతో కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బళ్లారి శ్రీరాములు ఆందోళనకు గురయ్యారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హోదాలో ఉంటూ బళ్లారి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బళ్లారి శ్రీరాములుకు బీజేపీ నుంచి లోక్‌సభ టికెట్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. బళ్లారి లోక్ సభ టిక్కెట్ శ్రీరాములును కాదని బీజేపీ ఎవ్వరికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ కళ్యాణ రాజ్యప్రగతి పార్టీ (కేఆర్‌పీపీ) నుంచి లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపుతామని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్పీపీ) అభ్యర్థిని బరిలోకి దింపితే ఓట్లు చీలిపోతాయనే భయం శ్రీరాములుకు పట్టుకుంది.
గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని మాజీ మంత్రి శ్రీరాములు ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఇప్పుడు మాజీ మంత్రి శ్రీరాములు తన ప్రాణ స్నేహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డిని ఒప్పించి కేఆర్ పీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు బళ్లారికి చెందిన శ్రీరాములు వర్గీయులు అంటున్నారు.
బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి కేఆర్ పీపీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడంపై చర్చించేందుకు గత వారం ఆ పార్టీ నాయకులను సమావేశానికి పిలిచిన గాలి జనార్దన్ రెడ్డి పలు అంశాలపై చర్చించారని కేఆర్‌పీపీ నాయకుడు ఒకరు తెలిపారు. బళ్లారి శ్రీరాములుకు రాజకీయ జీవితం ప్రారంభం నుండి మద్దతు ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి మొదటి సారి వారిలో మంత్రి పదవి కూడా శ్రీరాములుకు ఇప్పించారు.

అయితే గత కొన్నేళ్లుగా వ్యక్తిగతంగా, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి ఆయన ప్రాణ స్నేహితుడు శ్రీరాములు ఏరకంగానూ అండగా నిలబడలేదని రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. అందుకే షెడ్యూల్డ్ తెగ (రిజర్వుడు) నియోజకవర్గమైన బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి మా పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం ఖాయం అని గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు, కేఆర్ పీపీ పార్టీ నాయకులు కుండలుబద్దలు కొట్టి చెబుతున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చిన తరువాత కేఆర్‌పీపీ పార్టీని ప్రారంభించినప్పుడు బళ్లారి శ్రీరాములు మద్దతు ఇవ్వకపోవడంపై రెడ్డితో పాటు ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ శ్రీరాములు ఏకంగా గాలి జనార్దన్ రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణకి వ్యతిరేకంగా బళ్లారిలో పనిచేశారు. ఆ విషయం శ్రీరాములు గుర్తు పెట్టుకుంటే మంచిదని, ఇప్పుడు శ్రీరాములు మా సహాయం అడగడం సరికాదని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అంటున్నారు.
ఇటీవలి రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. లోక్ సభ ఎన్నిల్లో బీజేపీ నాయకుడు శ్రీరాములుపై కేఆర్ పీపీ అభ్యర్థిని నిలబెట్టడం వలన కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లను చీల్చేందుకు రాజకీయ ఎత్తుగడ అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు మళ్లీ ఒక్కటి అవుతారా ? లేదా ? అని బళ్లారిలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications