చంపి... ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసిన ఘనుడు....!!

సాధరణంగా ఎవరైన ఇతర వ్యక్తిని హత్యచేస్తే... దాన్ని నుండి తప్పించుకునేందుకు నానా తంటాలు పడతారు. ఎక్కడా తాము దొరకకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడతారు . పంజాబ్‌ మాత్రం ఇందుకు విరుద్దంగా కొనసాగుతోంది. తమ నేర స్వభావాన్ని ప్రజలకు చెప్పి వారిని భయబ్రాంతులకు గురి చేసే దారుణ సంఘటనలకు అక్కడి గ్యాంగ్‌స్టర్ వేదిక అవుతున్నారు. హత్య అనంతరం ఆ ఫోటోలు విడీయోలను సామాజిక మాద్యమాల్లో పెట్టి పేరు సంపాదించుకుంటున్నారు.

ఇందులో భాగంగానే పంజాబ్‌లో ఓ గ్యాంగ్‌స్టార్ ఓ వ్యక్తిని దారుణంగా చంపి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలోని పండోరి గ్రామానికి చెందిన మణిదీప్‌సింగ్ అనే వ్యక్తి స్కూటర్‌పై వెళుతుండగా హర్విందర్ అనే 26 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ అయన్ని వెంటాడాడు. అనంతరం కొద్ది దూరం వెళ్లాక మణిద్వీప్ సింగ్‌పై తుపాకితో ఎనిమది రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే చంపిన తర్వాత తాపిగా వెళ్లిన గ్యాంగ్‌స్టార్ తానే చంపాను అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

gangster admits to cold-blooded murder and post on Facebook

మణీదీప్‌ను హత్య చేసింది నేనే అంటూ అందులో చెప్పాడు. పాత కక్షల కారణంగానే చంపానని చెప్పాడు. అలా చంపడం మాకు గౌరవం అని పేర్కొన్నాడు. ఇక అలాంటీ తప్పు ఎవరైనా చేస్తే తాము వంద రౌండ్ల వరకు కూడ కాల్పులు జరుపుతామని అన్నాడు. ఈ కేసుపై తమపై చర్యలు తీసుకోవాలని కాని అమాయకులపై కేసులు నమోదు చేయకూడదంటూ పేర్కోన్నాడు. ఇక పోలీసులకు సవాల్ విసరడంతో వారు నేరస్తులను వెతికే పనిలో పడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటువంటి దారుణాలను వేదిక ఉపయోగించుకుంటున్న కరుడుగట్టిన నేరస్థులను కట్టడి చేయాలని అక్కడి పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+