వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

GATE 2022:ఇంపార్టెంట్ అప్‌డేట్... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వాయిదా..ఎప్పుడంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ విద్యార్థులు పై చదువుల కోసం రాసే గేట్ పరీక్షకు సంబంధించి అప్‌డేట్ వచ్చింది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) -2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగష్టు 30న ప్రారంభం కావాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడింది. గేట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇదే విషయాన్ని గేట్ అధికారిక వెబ్‌సైట్ పై పొందుపర్చింది. రిజిస్ట్రేషన్ లింక్‌ను అందుబాటులోకి తీసుకు రాగానే గేట్‌కు అప్లయ్ చేయాలనుకునే విద్యార్థులు గేట్ 2022 వెబ్‌సైట్ (GATE.iitkgp.ac.in)ను సందర్శించి అప్లికేషన్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఇక గేట్‌ పరీక్షకు అప్లయ్ చేసుకునేందుకు చివరి తేదీ 2021 సెప్టెంబర్ 24. అయితే ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అభ్యర్థులు అక్టోబర్ 1వరకు సబ్మిట్ చేయొచ్చు. ఇక రిజెక్ట్ అయిన అప్లికేషన్స్‌కు సంబంధించిన వివరాలను అక్టోబర్ 26వ తేదీన వెబ్‌సైట్‌ పై పొందుపరుస్తారు. ఈ అభ్యర్థులకు నవంబర్ 1వరకు తిరిగి అప్లయ్ చేసుకునేందుకు సమయం ఇస్తుంది. ఇక పేపర్‌లో మార్పు, కేటగిరీ, పరీక్ష కేంద్రంలాంటి వివరాల్లో మార్పు కావాలనుకుంటే అందుకు నవంబర్ 12వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి మార్పులు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులు అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

GATE-2022 online registration process have been postponed to September 2nd 2021.

ఇక ఈ సారి గేట్ 2022 పరీక్షను ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ నిర్వహిస్తోంది. గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారు మాస్టర్స్ చేసేందుకు అర్హత పొందడంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందేందుకు కూడా అర్హులు అవుతారు. గేట్ పరీక్ష 2022ను ఫిబ్రవరి 5వ తేదీ, 6వ తేదీ 12వ తేదీ మరియు 13వ తేదీల్లో నిర్వహిస్తారు. రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇక గేట్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు అబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. అంటే ఒక ప్రశ్న ఇచ్చి కింద నాలుగు సమాధానాలు ఇస్తారు. అభ్యర్థులు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

గేట్-2022కు ఎవరు అర్హులు:

డిగ్రీ మూడవ సంవత్సరం లేదా..అంతకంటే ఎక్కువగా ఉన్నడిగ్రీ ప్రోగ్రాం చేస్తున్న అభ్యర్థులు లేదా ఇప్పటికే ఇంజినీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/ ఆర్ట్స్/ గ్రూపుల్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.అయితే గేట్ 2022 రాసేందుకు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. గేట్ 2022 పరీక్షకు సంబంధించిన ఫీజు వివరాలు చూస్తే:

మహిళా అభ్యర్థులకు: రెగ్యులర్‌గా రూ.1200 లేటు ఫీజు రూ.1250/-

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు: రెగ్యులర్‌గా అయితే రూ.750/- లేటు ఫీజుతో రూ. 1250/-

మిగితా అభ్యర్థులు : రూ.1500/- లేటు ఫీజుతో రూ.2వేలు

గేట్ 2022 ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 2 సెప్టెంబర్ 2021

చివరితేదీ: 24 సెప్టెంబర్ 2021

లేట్ ఫీజుతో అప్లయ్ చేసేందుకు చివరి తేదీ: 1 అక్టోబర్ 2021

గేట్ -2022 అడ్మిట్ కార్డు: 3 జనవరి 2022

గేట్-2022 పరీక్ష - ఫిబ్రవరి 5,6,12,13

గేట్-2022 పరీక్ష ఫలితాలు: 17 మార్చి 2022

English summary
GATE-2022 online registration process have been postponed to September 2nd 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X