Maharastra Election Results: గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడి గెలుపు..!
మహారాష్ట్రలోని 29 పట్టణ స్థానిక సంస్థలకు నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఇందులో అధికార మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజార్టీ కార్పోరేషన్లలో ఈ కూటమి క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులేస్తోంది. అదే సమయంలో జల్నా కార్పోరేషన్ లో స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడిన శ్రీకాంత్ పంగార్కర్ విజయం సాధించారు. ఈయన
కర్నాటకకు చెందిన దివంగత మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు.
2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్ మహారాష్ట్రలోని జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో ఆయన స్వతంత్ర అభ్యర్దిగా గెలుపొందారు. ఫలితం ప్రకటించిన వెంటనే మద్దతుదారులతో కలిసి ఆయన తన విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించి పంగార్కర్ 2,621 ఓట్ల తేడాతో వార్డ్ 13 స్థానాన్ని గెలుచుకున్నారు.

ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఈ వార్డులో అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో ఇక్కడ స్వతంత్రులు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల మధ్య బహుముఖ పోటీ జరిగింది. ఇందులో గౌరీ లంకేష్ హత్యకు సంబంధించిన క్రిమినల్ కేసు విచారణలో ఉన్నప్పటికీ పంగార్కర్ విజయం సాధించారు. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త అయిన గౌరీ లంకేష్ ను 2017 సెప్టెంబర్ 5న కర్ణాటకలోని బెంగళూరులో తన ఇంటి బయట కాల్చి చంపేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి, రాజకీయ అసహనంపై చర్చకు దారితీసింది.

తరువాత ఈ కేసులో పంగర్కర్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. 2024లో కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తర్వాత 2011లో శివసేన టికెట్ నిరాకరించడంతో ఆయన హిందూ జనజాగృతి సమితిలో చేరారు. అనంతరం ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టయ్యారు. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంగర్కర్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. విమర్శల దెబ్బకు షిండే ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications