కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, 500 సీసీకెమెరాలలో హంతకుడు, సీఎంతో సిట్ భైటీ !
కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఎస్ఐటీ(సిట్) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఎస్ఐటీ(సిట్) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 500 సీసీ కెమెరాల పుటేజీలు స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు.
బసవణగుడిలోని లంకేష్ పత్రిక కార్యాలయం నుంచి రాజరాజేశ్వరీ నగరలోని ఐడిల్ హోమ్స్ లోని గౌరీ లంకేష్ ఇంటి వరకు ఉన్న అన్ని రహదారాలు, పలు మాల్స్ ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న సిట్ అధికారులు హంతకులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి బీకే. సింగ్ దర్యాప్తు వేగవంతం చేశారు. శుక్రవారం బెంగళూరులోని అధికార నివాసం కృష్ణలో సీఎం సిద్దరామయ్య సిట్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు విషయంపై చర్చించారు.
కర్ణాటక డీజీపీ రూప్ కుమార్ దత్త (ఆర్ కే. దత్త), సిట్ అధికారి బీకే. సింగ్ తదితరులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయ్యి గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు తీరును వివరించారు. గౌరీ లంకేష్ హత్యను ఖండిస్తూ శుక్రవారం బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications