వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దౌర్జన్యమా: కిరణ్ తీరుపై గీతా కన్నీరు, బిల్లులపై చిద్దూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Geeta Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పట్ల ఆవేదన చెందిన మంత్రి గీతా రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం కిరణ్ దీక్షకు బయలుదేరిన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మహిళా మంత్రులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దీనిపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఉద్వేగానికి లోనయ్యారు.

తాము మంత్రులమని, అదీ మహిళమని చూడకుండా పోలీసులతో దౌర్జన్యం చేయిస్తారా అని వాపోయారు. తమ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, పక్కకు ఈడ్చి పడేశారని తెలిపారు. సమైక్యం అంటున్న ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

కాగా, బుధవారం ప్రారంభమైన ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ తప్ప ఏదయినా ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందడం అనుమానాస్పదమేనని ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. చట్టాలను ఆమోదించడానికి పార్లమెంటు సమావేశం కాకపోతే, ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఏదయినా ముఖ్యమైన బిల్లుకు ఆమోదం లభిస్తుందా అనేది అనుమానమేనని చిదంబరం అన్నారు.

ప్రతిరోజూ పార్లమెంటుకు వెళ్లడం, వట్టి చేతులతో తిరిగి రావడం అనేది మాకు మామూలయిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక్కడి శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన వాణిజ్య సదస్సులో ఆ కళాశాల విద్యార్థుల నుద్దేశించి చిదంబరం మాట్లాడారు. అనంతరం చిదంబరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లు, ఓట్ ఆన్ అకౌంట్, అనుబంధ పద్దులను ఆమోదించాల్సి ఉందన్నారు.

అయితే అవి ఎలాంటి చర్చా లేకుండా ఆమోదం పొందితే తాను సంతోషించనని, పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత వాటిని ఆమోదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ నెల 21న ముగిసే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో చాలా బిల్లులను ప్రభుత్వం ఆమోదింపజేసుకోవాలనుకుంటోన్న విషయం తెలిసిందే.

English summary
Minister Geeta Reddy on Wednesday wept for Chief Minister Kiran Kumar Reddy's attitude on Telangana women ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X