అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్టకు వెళ్లే అతిథులకు గిప్ట్‌లు..
ఈ నెల 22న అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ ఉత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు బహుమతులు అందజేయనున్నారు. ఇప్పటికే అయోధ్య రాములోరి విగ్రహ ప్రతిష్టకు పదకొండు వేల మందికి ఆహ్వానాలు అందనున్నాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, ప్రముఖులు సీనితారలకు ఆహ్వానాలు అందాయి. ఇంకా రామమందిరాన్ని నిర్మించిన కూలీల కుటుంబసభ్యులు కూడా ఈ మహత్తర కార్యానికి హాజరుకానున్నారు.
అయోధ్య రాములోరి ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు రిటర్న్ గిప్ట్‌లు ఇచ్చేందుకు ఆలయ ట్రస్టు సన్నాహాలు చేస్తోంది. అయోధ్యకు వచ్చే అతిథుల కోసం ఇప్పటికే వసతులు, సౌకర్యాలు అన్నింటిని జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజుల పాటు అయోధ్య నగరమంతా ఎంతో కోలాహాలంగా మారనుంది. ఇక, ఈ మహత్తర కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. ఆయనకు ప్రత్యేక బహుమతులు కూడా అందజేయనున్నారు. 15 మీటర్ల పొడవైన రాముడి చిత్రాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాని నరేంద్రమోడీకి బహుమతిగా ఇవ్వనున్నారు.

7,500 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు..:
అంతేకాకుండా, అయోధ్యకు వచ్చే అతిథులకు కూడా బహుమతులు ప్రదానం చేయనున్నారు. రెండు బహుమతులను ఇవ్వనున్నారు. ఒక బాక్సులో లడ్డు ప్రసాదం ఉండగా, మరొక బాక్సులో దేశీ నెయ్యితో తయారుచేసిన మోతిచూర్ లడ్డూను అతిథులకు అందజేయనున్నారు. ఇక రెండో బాక్స్‌లో అయోధ్య నేలమట్టి, సరయూ నదీ నీళ్లతో పాటు ఓ మొమెంటోనూ కూడా ప్రదానం చేయనున్నారు. అయోధ్య పునాదుల నుంచి తీసిన మట్టిని అతిథులకు పంపీణి చేయడం జరుగుతుంది. వీటన్నింటితో పాటు ఇత్తడి పళ్లెం, వెండి నాణేలు కూడా ఉండనున్నాయి.
ఈ వెండినాణేలు, ఇత్తడి పళ్లెలాపై రామమందిర చిత్రాన్ని ముద్రించనున్నారు. ఈ రెండు స్పెషల్ గిప్ట్‌లు ప్రత్యేకంగా ఓ బ్యాగ్‌ను కూడా తయారు చేయిస్తున్నారు. అయోధ్య రాములోరి విగ్రహా ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో 7,500 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లను చేయనున్నారు. అతిథులు ఎవరైనా ఈ నెల 22 వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాలేకపోతే వారు అయోధ్యను సందర్శించినప్పుడు ఈ మట్టిని అందజేయడం జరుగుతుందని ఆలయ ట్రస్ట్ సభ్యుడు తెలిపారు.












Click it and Unblock the Notifications