కాలేజ్ ముందే ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణ హత్య, వెంటాడి పోడిచిన కామాంధుడు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: చెన్నై నగరంలో పట్టపగలు నడిరోడ్డు మీద ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైయ్యింది. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినిని హత్య చేసిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితకబాది స్థానిక పోలీసులకు అప్పగించారు. కాలేజ్ కు 100 మీటర్ల దూరంలో ఎం. అశ్వినీ (19) అనే యువతి దారుణ హత్యకు గురైయ్యింది.

 మీనాక్షి కాలేజ్

మీనాక్షి కాలేజ్

పశ్చిమ చెన్నైలోని మదురఓయల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అశ్వినీ కేకే నగరలోని మీనాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ లో మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం అశ్వినీ కాలేజ్ కు వెళ్లింది.

నిఘా వేసిన కామాంధుడు

నిఘా వేసిన కామాంధుడు

చెన్నైలో నివాసం ఉంటూ మినరల్ వాటర్ వ్యాపారం చేస్తున్న అళగేశన్ అనే యువకుడు శుక్రవారం మీనాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో మకాం వేశాడు. అశ్వినీ కాలేజ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చింది. కాలేజ్ సమీపంలో అశ్వినీ వెలుతున్న విషయం అళగేశన్ గుర్తించాడు.

కత్తితో దాడి

కత్తితో దాడి

అశ్వినీ మీద అళగేషన్ కత్తితో దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్లు అశ్వినీని పొడిచాడు. అశ్వినీ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అళగేశన్ మాత్రం వదల్లేదు. అశ్వినీ శరీరం నుంచి తీవ్రస్థాయిలో రక్తం పోవడంతో పరిసర ప్రాంతాలు మొత్తం రక్తపు మరకలు అయ్యాయి.

చితకబాదిన స్థానికులు

చితకబాదిన స్థానికులు

అశ్వినీ మీద కత్తితో దాడి చేసిన నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే విషయం గుర్తించిన స్థానికుల వెంటాడి అళగేశన్ ను పట్టుకుని చితకబాదేశారు. తీవ్రగాయాలైన అశ్వినీ సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే మృతి

అప్పటికే మృతి

కత్తిపోట్లు ఎక్కవ పడటం, రక్తం ఎక్కువ పోవడంతో అప్పటికే అశ్వినీ మరణించిందని వైద్యులు చెప్పారు. అశ్వినీ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలోనే అళగేశన్ మీద ఓ క్రిమినల్ కేసు నమోదు అయ్యిందని, అతను బెయిల్ మీద బయటకు వచ్చి అశ్వినీని హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 19-year-old student was allegedly stabbed to death by a man on Friday afternoon as she was leaving her college at West KK Nagar in Chennai.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి