Instagram: అమ్మాయిలకు వలవేసి వాళ్ల ఇంట్లో వాళ్లనే ?, కేటుగాడు రూ. 16 లక్షల, క్లైమాక్స్ !
బెంగళూరు: సోషల్ మీడియాలో అమ్మాయిలతో ఓ యువకుడు పరిచయాలు పెంచుకుంటున్నాడు. తరువాత అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకుని వారితో స్నేహంగా ఉన్నట్లు నటించాడు. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకున్నాడు. అమ్మయిల వ్యక్తిగత చిత్రాలను సేకరించాడు. అమ్మాయిలను బెదిరించిన యువకుడు వారి ఇళ్లల్లో నుంచి బంగారు నగలు చోరీ చేసి తెప్పించుకున్నాడు. అమ్మాయిలను బెదిరించి లక్షల రూపాయల బంగారు నగలు తెప్పించుకుని వాటిని కుదవపెట్టి పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కేటుగాడు రూ. 16 లక్షల విలువైన నగలు కుదువపెట్టేశాడు.

తమిళనాడు యువకుడు
తమిళనాడుకు చెందిన రాబర్ట్ అనే యువకుడు బెంగళూరు గ్రామీణ జిల్లాలోని డాబస్ పేట్ కు చేరుకుని నివాసం ఉంటున్నాడు. ఎలాంటి పనిపాట చెయ్యకుండా రాబర్ట్ గాలికి తిరుగుతున్నాడు మంచి స్మార్ట్ మొబైల్ ఫోన్ తీసుకున్న రాబర్ట్ ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, టెలిగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు.

అమ్మాయిలకు వల
ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియాలో రాబర్ట్ అమాయకులైన అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుంటున్నాడు. తరువాత అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్న రాబర్ట్ వారితో స్నేహంగా ఉన్నట్లు నటించాడు. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకున్నాడు. కొంతమంది అమ్మయిల వ్యక్తిగత చిత్రాలను రాబర్ట్ సేకరించాడని తెలిసింది.

ఒకే అమ్మాయి దగ్గర 165 గ్రాములు
అమ్మాయిలను తరువాత బెదిరిస్తున్న రాబర్ట్ మీ ఇళ్లలో నుంచి బంగారు నగలు తెచ్చి ఇవ్వకపోతే మీ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తానని వారిని బెదిరించాడు. ఇలా రాబర్ట్ అమ్మాయిల ఇళ్లల్లో నుంచి బంగారు నగలు చోరీ చేసి తెప్పించుకున్నాడు. డాబస్ పేట్ కు చెందిన ఒకే అమ్మాయి ఆమె ఇంటిలో 165 గ్రాముల బంగారు నగలు చోరీ చేసి రాబర్ట్ కు ఇచ్చింది.

నగలు కదువ పెట్టి ఎంజాయ్
రాబర్ట్ అమ్మాయిలతో పాటు మరో అమ్మాయిని ఇలాగే బెదిరించి 110 గ్రాముల బంగారు నగలు ఇప్పించుకున్నాడు. అమ్మాయిల దగ్గర బంగారు నగలు తెప్పించుకుని వాటిని డాబస్ పేట్, దోడ్డబళ్లాపురంలో స్నేహితుల పేరుతో ముత్తూట్ ఫైనాన్స్ లో కుదువపెట్టి ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రాబర్ట్ ను అరెస్టు చేసి రూ. 16 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకుని అతన్ని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications