Girlfriend: ప్రియుడికి జ్యూస్ లో విషం కలిపి చంపేసింది, కన్నింగ్ లేడీ కథ క్లోజ్ !

తిరువనంతపురం/కన్యాకుమారి: కాలేజ్ లో చదువుతున్న సమయంలో పరిచయం కావడంతో యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు సంతోషంగా తిరిగారు. పెళ్లి విషయంలో ప్రియురాలు వెనకడుగు వేసింది. మనం విడిపోదామని ప్రియుడికి మీద ఒత్తిడి చేసింది. ఇదే విషయం ప్రేమికుల మద్య గొడవలకు కారణం అయ్యింది. ఇంటికి భోజనానికి రావాలని ప్రియుడికి అతని ప్రియురాలు చెప్పింది. భోజనం చెయ్యడానికి ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు జ్యూస్ తాగి వాంతులు చేసుకున్నాడు. తరువాత ప్రియుడు చనిపోయాడు. ప్రియుడి తండ్రి ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. ప్రియురాలు ఆమె ప్రియుడికి జ్యూస్ లో విషం కలిపి చంపేసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ప్రియురాలి ఇంటిలో జ్యూస్ బాటిల్, విషం బాటిల్ చిక్కడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

 కాలేజ్ లవర్స్

కాలేజ్ లవర్స్

తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన షరోన్ రాజ్ అలియాస్ షారోన్ అనే యువకుడు కేరళలోని తిరువనంతపురంలో చదువుకునే సమయంలో గిరిష్మా అనే యువతి అతనికి పరిచయం అయ్యింది. కాలేజ్ లో చదువుతున్న సమయంలో పరిచయం కావడంతో షారోన్, గిరిష్మా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు షారోన్, గిరిష్మా కొంతకాలం చాలా సంతోషంగా తిరిగారు.

 తేడా వచ్చింది.... బ్రేకప్ కు సిద్దం అయిన ప్రియురాలు

తేడా వచ్చింది.... బ్రేకప్ కు సిద్దం అయిన ప్రియురాలు

రానురాను గిరిష్మా ఆమె ప్రియుడు షారోన్ కు దూరం కావడానికి ప్రయత్నించింది. షారోన్ తో బ్రేకపక్ కు సిద్దం అయిన గిరిష్మా అదే విషయం ప్రియుడికి చెప్పింది. అయితే గిరిష్మాను వదిలి పెట్టడానికి షారోన్ సిద్దంగా లేడని సమాచారం. ఎలాగైనా ప్రియుడు షారోన్ ను దూరం చేసుకోవాలని గిరిష్మా అనేక ప్రయత్నాలు చేసింది.

 పెళ్లి చేసుకోవాలని సిద్దం అయిన ప్రియుడుకంటేనా

పెళ్లి చేసుకోవాలని సిద్దం అయిన ప్రియుడుకంటేనా

ప్రియురాలు గిరిష్మా దూరం కావడానికి ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న షారోన్ మనం పెళ్లి చేసుకుందామని ప్రియరాలి మీద ఒత్తిడి చేశాడు. షారోన్ ను పెళ్లి చేసుకునే విషయంలో అతని ప్రియురాలు గిరిష్మా వెనకడుగు వేసింది. ఇదే విషయం ప్రేమికులు షారోన్, గిరిష్మాల మద్య గొడవలకు కారణం అయ్యింది.

 ప్రియుడికి జ్యూస్ లో విషం కలిపి చంపేసింది

ప్రియుడికి జ్యూస్ లో విషం కలిపి చంపేసింది

ప్రియుడు షారోన్ అడ్డుతొలగిపోవాలంటే అతన్ని చంపేయాలని గిరిష్మా స్కెచ్ వేసింది. బయట హత్య చేస్తే పోలీసులకు చిక్కిపోతామని గిరిష్మా భయపడింది. తన ఇంటికి భోజనానికి రావాలని ప్రియుడు షారోన్ కు అతని ప్రియురాలు గిరిష్మా ఫోన్ చేసి చెప్పింది. భోజనం చెయ్యడానికి ప్రియురాలు గిరిష్మా ఇంటికి వెళ్లిన ప్రియుడు షారోన్ కు జ్యూస్ లో విషం కలిపి ఇచ్చింది.

 ప్రియుడు ఔట్

ప్రియుడు ఔట్

జ్యూస్ తాగి షారోన్ వాంతులు చేసుకున్నాడు. కొంతసేపటికి అస్వస్వతకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన షారోన్ కుప్పకూలిపోవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై షారోన్ చనిపోయాడు. విషం తాగడం వలన షారోన్ చనిపోయాడని వైద్యులు చెప్పాడు. తన కొడుకు షారోన్ ను అతని ప్రియురాలు గిరిష్మా హత్య చేసిందని ప్రియుడి తండ్రి కేసు పెట్టడంతో సీన్ మొత్తం మారిపోయింది.

 ప్రియురాలు అందర్

ప్రియురాలు అందర్

కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి గిరిష్మాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. షారోన్ ను అతని ప్రియురాలు గిరిష్మా జ్యూస్ లో విషం కలిపి చంపేసిందని వెలుగు చూడటం కేరళలో, తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

 జోతిష్యుడి మాటలు నమ్మి ఏం చేసిందంటే ?

జోతిష్యుడి మాటలు నమ్మి ఏం చేసిందంటే ?

షారోన్ ప్రియురాలు గిరిష్మా ఇంటిలో జ్యూస్ బాటిల్, విషం బాటిల్ చిక్కడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. గిరిష్మాను వివాహం చేసుకున్న తరువాత భర్త చనిపోతాడని, రెండో పెళ్లి చేసుకున్న తరువాత ఆమె జీవితం చాలాబాగా ఉంటుందని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని తెలిసింది. గిరిష్మా తన ప్రియుడు షారోన్ తో తాళి కట్టించుకుని తరువాత అతన్ని చంపేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+