చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Girlfriend: కాలేజ్ అమ్మాయి, కొత్త ప్రియుడితో కలిసి మాజీ బాయ్ ఫ్రెండ్ ను గూండాలతో ?, సీసీటీవీల్లో !

|
Google Oneindia TeluguNews

చెన్నై/కన్యాకుమారి: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి, కాలేజ్ చదువు పూర్తి చేసుకున్న యువకుడికి పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రియురాలి కోరిక మేరకు ప్రియుడు ఆమె ఇంటికి వెళ్లి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రేమికులకు పెళ్లి చెయ్యాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రేమికులు భార్యభర్తల్లా అందరి ముందు హ్యాపీగా తిరుగుతున్నారు. ప్రియురాలి మీద డౌట్ రావడంతో ప్రియుడు ఆమె మీద నిఘా వెయ్యడంతో అతనికి షాకింగ్ సమాచారం తెలిసింది. ప్రియుడికి మ్యాటర్ లీక్ అయ్యిందని తెలుసుకున్న ప్రియురాలు కిరాయి గూండాలతో అతన్ని చంపించడానికి ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది.

Wife: బెడ్ రూమ్ లో భార్యను నరికి చంపి ఇంటికి తాళం వేసి భర్త ఎస్కేప్, గృహప్రవేశం టైమ్ లో షాక్ !Wife: బెడ్ రూమ్ లో భార్యను నరికి చంపి ఇంటికి తాళం వేసి భర్త ఎస్కేప్, గృహప్రవేశం టైమ్ లో షాక్ !

కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని వోరెకలంబి ప్రాంతంలో ప్రవీణ్ నే యువకుడు నివాసం ఉంటున్నాడు. డిప్లొమో పూర్తి చేసిన ప్రవీణ్ వెల్డర్ గా పని చేస్తున్నాడు. కన్యాకుమారి జిల్లాలోన నివాసం ఉంటున్న జెస్లిన్ (19) అనే యువతి కాలేజ్ లో డిగ్రీ యవతి చదువుతోంది. జెస్లిన్ కాలేజ్ కు వెళ్లి వస్తోంది.

ప్రేమికులు ఎంజాయ్

ప్రేమికులు ఎంజాయ్

గత సంవత్సరం జెస్లిన్ కు, ప్రవీణ్ కు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. రానురాను నేరుగా కలుసుకున్న ప్రవీణ్, జెస్లిన్ తరువాత ప్రేమించుకున్నారు. ప్రేమికులు జెస్లిన్, ప్రవీణ్ హ్యాపీగా తిరిగేశారు. ఇప్పటికే పని చేసి డబ్బుు సంపాధిస్తున్న ప్రవీణ్ అతని ప్రియురాలి కోసం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశాడు.

పెళ్లికి గ్రీన్ సిగ్నల్

పెళ్లికి గ్రీన్ సిగ్నల్

కొంతకాలం తరువాత జెస్లిన్ ను పెళ్లి చేసుకుంటానని ప్రవీణ్ చెప్పాడు. మా ఇంట్లో అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని జెస్లిన్ ఆమె ప్రియుడు ప్రవీణ్ కు చెప్పింది. ప్రియురాలు జెస్లిన్ కోరిక మేరకు ప్రవీణ్ ఆమె ఇంటికి వెళ్లి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రేమికులు ప్రవీణ్, జెస్లిలన్ కు రెండు సంవత్సరాల తరువాత పెళ్లి చెయ్యాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

ఖరీదైన బహుమతులు ఇచ్చిన ప్రియుడు

ఖరీదైన బహుమతులు ఇచ్చిన ప్రియుడు

పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రేమికులు ప్రవీణ్, జెస్లిన్ భార్యభర్తల్లా అందరి ముందు హ్యాపీగా తిరుగుతున్నారు. ప్రవీణ్ కష్టపడి సంపాధిస్తున్న డబ్బుతో ఆమెకు బంగారు చైన్, ఉంగరాలు, కమ్మలు బహుమతిగా ఇచ్చాడు. ప్రియురాలు జెస్లిన్ కూడా ప్రియుడు ప్రవీణ్ కు చిన్నిచన్న బహుమతులు ఇచ్చింది.

ప్రియురాలి మీద డౌట్

ప్రియురాలి మీద డౌట్


కొంతకాలం క్రితం ప్రియురాలు జెస్లిన్ మీద డౌట్ రావడంతో ప్రవీణ్ ఆమె మీద నిఘా వేశాడు. జెస్లిన్ ఇంటి పక్కన ఉన్న జెతిన్ అనే కారు డ్రైవర్ తో తన ప్రియురాలు తిరుగుతోందని ప్రవీణ్ కు షాకింగ్ సమాచారం తెలిసింది. జెస్లిన్, జెతిన్, జెస్లిన్ బైక్ లో రహస్య ప్రాంతానికి వెలుతున్న సమయంలో ప్రవీణ్ వారిని చూశాడు.

రూట్ మార్చిన ప్రియురాలు

రూట్ మార్చిన ప్రియురాలు

ప్రవీణ్ అతని ప్రియురాలు జెస్లిన్ నిలదీశాడు. మనకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని, నువ్వు జెతిన్ తో ఎందుకు తిరుగుతున్నావని మండిపడ్డాడు. నేను జెనిన్ ను ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని జెస్లిన్ చెప్పింది. రగిలిపోయిన ప్రవీణ్ నేను ఇచ్చిన బహుమతులు మొత్తం ఇచ్చేయాలని జెస్లిన్ కు చెప్పాడు. నీ బహుమతులు ఇచ్చేస్తానను రావాలని ప్రవీణ్ కు జెస్లిన్ ఫోన్ చేసి చెప్పింది.

వెంటాడి దాడి చేసిన కొత్త ప్రియుడు, గూండాలు

వెంటాడి దాడి చేసిన కొత్త ప్రియుడు, గూండాలు

ప్రవీణ్ బహుమతులు వెనక్కి తీసుకోవడానికి బైక్ లో బయలుదేరాడు. మార్గంమద్యలో జెస్లిన్ ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ జెతిన్ తో మరో బైక్ లో ప్రవీణ్ ను వెంబడించారు. మార్గం మద్యలో జెతిన్ సెట్ చేసిన ఇద్దరు కిరాయి గూండాలు ప్రవీణ్ బైక్ ను ఢీకొట్టారు. ఆ సందర్బంలో కిరాయి గూండాలు, జెస్లిన్ కొత్త ప్రియుడు జెతిన్ కలిసి ప్రవీణ్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు.

సీసీటీవీ కెమెరాల్లో

సీసీటీవీ కెమెరాల్లో

పబ్లిక్ లో ప్రవీణ్ మీద దాడి చేస్తుంటే అతని మాజీ ప్రియురాలు జెస్లిన్ సినిమా చూసినట్లు చూసింది. స్థానికులు జోక్యం చేసుకుని తకల్ ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించి జెస్లిన్, జెతిన్ తో పాటు మరో ఇద్దరు కిరాయి గూండాలను గుర్తించి వారి మీద కేసు నమోదు చేసి పరారైన వాళ్ల కోసం గాలిస్తున్నారు. ఇటీవల కన్యాకుమారి జిల్లాలో అమ్మాయిలు వారి ప్రియులను టార్గెట్ చేస్తుండటం ఆ జిల్లాలో కలకలం రేపింది.

English summary
Girlfriend: College girl sets up goondas to attack ex boyfriend over love issue near Kanyakumari in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X