Girlfriend: పక్క రాష్ట్రానికి బాయ్ ఫ్రెండ్ ను పిలిపించిన ప్రియురాలు, లాడ్జ్ లో ప్రియుడు ఏం చేశాడంటే ?
ప్రియుడికి ఫోన్ చేసిన ప్రియరాలు నేను వేరే రాష్ట్రంలో ఉన్నానని, నువ్వు అక్కడికి వస్తే మనం ఎంజాయ్ చేద్దామని చెప్పింది.
బెంగళూరు/హాసన్: ప్రియుడికి ఫోన్ చేసిన ప్రియరాలు నేను వేరే రాష్ట్రంలో ఉన్నానని, నువ్వు అక్కడికి వస్తే ఎంజాయ్ చేద్దామని చెప్పింది. ప్రియుడు ఎగరేసుకుంటూ ప్రియురాలు చెప్పిన సిటీకి వెళ్లాడు. అక్కడ ప్రియురాలు కనపడకపోవడంతో ప్రియుడు ఆందోళన చెందాడు. ప్రియురాలికి ఫోన్ చేస్తే ఓరి పిచ్చోడా, నేను మా ఊరిలోనే ఉన్నానని, ఇక ముందు మనం కలవడానికి వీలుకాదని, నువ్వు వేరే అమ్మాయిని చూసుకోవాలని, ఇంతకాలం మనం ఎంజాయ్ చేంది చాలు అని చెప్పింది. ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు రగిలిపోయాడు.

ఒకే జిల్లాలో ప్రేమికులు
కర్ణాటకలోని హాసన్ నగరంలోని సంగమేశ్వర బ్యారేజీ సమీపంలో కార్తీక్ అలియాస్ కార్తీ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం హాస్ జిల్లాలోని హలేనరసీపురకు చెందిన సుధా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి కార్తీక్ కు పరిచయం అయ్యింది. సంవత్సరం పాటు కార్తీక్, సుధా ఫోన్లలో మాట్లాడుకున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి సుధా, కార్తీక్ ప్రేమించుకుంటున్నారు. మనం పెళ్లి చేసుకుందామని సుధా ఆమె ప్రియుడు కార్తీక్ కు చెప్పింది.

హ్యాపీగా ఎంజాయ్ చేసిన ప్రేమికులు
కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ప్రేమికులు సుధా, కార్తీక్ ఇంతకాలం విహారయాత్రలకు, సినిమాలు, షికార్లకు తిరుగుతున్నారు. ప్రియుడు కార్తీక్ పిలిచిన ప్రతి చోటకు అతని ప్రియురాలు సుధా వెళ్లి వస్తోంది. పెళ్లికి ముందే కార్తీక్, సుధా శారీరక సంబంధం పెట్టుకుని ఇద్దరూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. కార్తీక్, సుధాల ప్రేమ వ్యవహారం ఇరువైపుల స్నేహితులకు తెలుసు.

వెంటనే చెన్నైకి వచ్చేయ్ ఎంజాయ్ చేద్దాము
జనవరి 27వ తేదీను సుధా ఆమె ప్రియుడు కార్తీక్ కు ఫోన్ చేసింది, తాను చెన్నైలో ఉన్నానని, నువ్వు అక్కడికి రావాలని, మనం ఇక్కడే పెళ్లి చేసుకుని ఉండిపోదామని ఫోన్ చేసి చెప్పింది. ప్రియురాలు సుధా మాటలు నమ్మిన ప్రేమికుడు కార్తీక్ ఆమెను కలవాలని తహతహలాడిపోయాడు. అక్కడక్కడ డబ్బులు తీసుకున్న కార్తీక్ ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి చెన్నై సిటీకి వెళ్లిపోయాడు.

మాటమార్చి హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు
చెన్నై నగరంలో సుధా చెప్పిన ప్రాంతాలు అన్నీ వెతికిన కార్తీక్ షాక్ అయ్యాడు. తరువాత కార్తీక్ అతని ప్రియురాలు సుధాకు ఫోన్ చేశాడు. తాను హాసన్ జిల్లాలోని హలేనరసీపురలోని మా ఇంటిలోనే ఉన్నానని కార్తీక్ కు చెప్పింది. ఎందుకు ఇలా చేశావు అని కార్తీక్ అతని ప్రియురాలు సుధాను ప్రశ్నించాడు. ఇక ముందు మనం కలవడానికి వీలుకాదని, నువ్వు వేరే అమ్మాయిని చూసుకోవాలని, ఇంతకాలం మనం ఎంజాయ్ చేంది చాలు అని సుధా ఆమె ప్రియుడు కార్తీక్ కు కఠినంగా చెప్పిందని తెలిసింది.

లాడ్జ్ లో ఆత్మహత్య
చెన్నైలో అప్పటికే ప్రియురాలి కోసం రూమ్ తీసుకున్న కార్తీక్ హడలిపోయాడు. తన ప్రియురాలు తనను మోసం చేసిందని, పెళ్లి చేసుకుందామని నమ్మించి పిలిపించి నిలువునా మోసం చేసిందని కార్తీక్ రగిలిపోయాడు. అరకంబాక్కం ఏరియాలో లాడ్జ్ లో రూమ్ తీసుకున్న కార్తీక్ అదే రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

డెత్ నోట్ రాసిన ప్రియుడు
కార్తీక్ ఆత్మహత్య చేసుకునే ముందు లాడ్జ్ లో ఓ డెత్ నోట్ రాసిపెట్టాడని పోలీసులు అంటున్నారు. నా ప్రియురాలు నన్ను నిలువునా మోసం చేసిందని, నా చావుకు ఆమె కారణం అని కార్తీక్ డెత్ నోట్ లో రాశాడని పోలీసులు చెప్పారు. కార్తీక్ హాసన్ లోని ఓ పప్రైవేట్ లాడ్జ్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్ ను అతని ప్రియురాలు మోసం చెయ్యడం వలనే అతను ఆత్మహత్య ేుకున్నాడని, అతని చావుకు కారణం అయిన యువతి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రియురాలి మీద ?
నాలుగేళ్లుగా యువతిని ప్రేమించి మోసపోయిన కార్తీక్ పెళ్లి చేసుకోవడానికి తమిళనాడులోని చెన్నైలో ఆత్మహత్య చేసుకోవడంతో అతని స్నేహితులు హడలిపోయారు. కార్తీక్ ను అతని ప్రియురాలు మోసం చేసిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి మీద కఠిన చర్యలు తీసుకోవాలని హసన్ లోని అతని బంధువులు పోలీసులకు మనవి చఏశారు. చెన్నైలోని ఆరంబాక్కం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం కార్తీక్ మృతదేహాన్ని హాసన్‌కు తీసుకొచ్చారు. కుటుంబానికి ఆసరాగా ఎదుగుతాడని భావించిన కొడుకు కార్తీక్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని తల్లిదండ్రుల రోదిస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications