లవర్స్ జంప్, ఇంట్లో ఎవరు చిక్కితే వాళ్లును ఎత్తుకెళ్లి ఏం చేశారంటే ?, ఆంటీ దెబ్బతో హడల్ !
దేశవ్యాప్తంగా కలకలం రేపిన బెళగావి మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఉదంతాన్ని గుర్తుచేస్తూ కర్ణాటకలో మరోసారి హవేరి జిల్లాలో ఆందోళనకరమైన సంఘటన జరిగింది. తమ కూతురు ప్రియుడితో పారిపోయిందని ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు, బంధువులు రాత్రి యువకుడి నివాసంపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి యువకుడి చిన్నమ్మను అపహరించి, బట్టలు విప్పి దాడికి పాల్పడ్డారని సమాచారం.
ఈ ఘటన హావేరి జిల్లాలోని రాణేబెన్నూరు తాలూకా ముదేనూరు గ్రామంలో చోటుచేసుకుంది. సంగీతా అనే యువతి, ప్రకాష్ నే యువకుడు కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.డిసెంబర్ 15న చలగేరి గ్రామానికి చెందిన సంగీతా ముదేనూరు గ్రామానికి చెందిన ప్రకాష్ అనే యువకుడితో కలిసి పారిపోయింది. ఇరు కుటుంబాల నుంచి పెళ్లికి తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సంగీతాకు వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది.

ప్రకాష్ తల్లిదండ్రులు, బంధువులు అతడికి మద్దతుగా ఉన్నారని, అందుకే సంగీతాను అతను లేపుకుపోయాడని యవతి కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రకాష్ కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ప్రకాశ మేనమామ తన వాహనంలో ప్రశాంత్‌ను తనతో పాటు రాణేబెన్నూరు పట్టణానికి తీసుకొచ్చినట్లు సమాచారం.గతంలో ప్రియుడు ప్రకాష్ ను సంగీత కుటుంబ సభ్యులు చొక్కా విప్పి చాలాసార్లు కొట్టారు.
పోలీస్ స్టేషన్ ఎదుటే దాడికి ప్రియుడు ప్రకాష్ మీద పాల్పడ్డారని ఆరోపించారు.యువకుడి కుటుంబీకులు రాణేబెన్నూరు రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రుణం విషయంలో గతంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రేమికులు సంగీతా, ప్రకాష్ ఆచూకీ ఇంకా తెలియలేదని పోలీసులు అంటున్నారు. సంగీతా కుటుంబ సభ్యులు హలగేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి కూతురు తల్లి ఇంత జరగడానికి కారణం అయ్యిందని ప్రకాష్ బంధువులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications