బాలికల సెక్స్ వయస్సు 16ఏళ్ళకు తగ్గించాలి: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!!

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు గ్వాలియర్ ధర్మాసనం అమ్మాయిల సెక్స్ వయసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల శృంగార వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలని అభిప్రాయం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఈ పని చేస్తే టీనేజ్లో ఉన్న బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అమ్మాయిల శృంగార వయసును తగ్గించే అంశంపై కేంద్రం ఆలోచన చేయాలని అభిప్రాయపడింది. ఓ కేసు విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది . 2020 లో ఒక బాలికను పదేపదే రేప్ చేసి, ఆమెను గర్భవతిని చేశాడని ఒక యువకుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను విచారించి, దానిని హైకోర్టు కొట్టివేసింది.

Girls Sex age should be reduced 18 years to 16 years: High Court sensational comments!!

ఇక ఈ క్రమంలోనే కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఇంటర్నెట్ వల్ల 14 సంవత్సరాలకే అమ్మాయిలకు యుక్తవయస్సు వస్తోందని, అన్ని విషయాలు వారికి అర్థం అవుతున్నాయి అని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇద్దరి అంగీకారంతోనే లైంగిక సంబంధాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. 17 ఏళ్ల బాలికపై నమోదైన రేప్ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ధర్మాసనం బాలికల శృంగార వయసుపై సంచలన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

ప్రస్తుతం సమాజంలో చాలామంది అమ్మాయిలు టీనేజ్ నుండే అబ్బాయిలతో శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇందులో తప్పు ఇద్దరిదీ ఉన్నప్పటికీ అమ్మాయిలను మైనర్ గా పరిగణించి అబ్బాయిల పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు, అందువల్ల అబ్బాయిల బంగారు భవిష్యత్తు పాడైపోతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

అందుకే అమ్మాయిల శృంగార సమ్మతి వయసును 16 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్రానికి సూచించింది. భారతీయ శిక్షాస్మృతి సవరణ చేయకముందు ఈ వయసు పదహారేళ్లు గానే ఉండేదని, ఇప్పుడు మళ్లీ దీనిని సవరించవలసిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. తద్వారా బాలురకు అన్యాయం జరగకుండా కాపాడవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+