India TV-Ground Zero Exit Poll: కాంగ్రెస్ కు నాలుగు రాళ్లు ఎక్కువ వేసిన సర్వే, అయితే !
గోవా/పణజి: 2017లో గోవా శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేసి ఐదు సంవత్సరాలు అధికారానికి దూరం అయ్యింది. చిక్కిన చాన్స్ సద్వినియోగం చేసుకున్న బీజేపీ నాయకులు గోవాలో అధికారం చేపట్టారు. గోవాలో అధికారం కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకులేకపోయారు. తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం వన్ బై వన్ అంటూ బీజేపీలోకి జంప్ అయ్యారు. ఈ దెబ్బతో గోవాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసహనంతో రగిలిపోయారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించిందని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రగిలిపోయారు. నాయకులతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూల్ గా బీజేపీలోకి జంప్ అయ్యారు.
ఇప్పుడు గోవాలో మరోసారి ఏపార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని అన్ని సర్వేలు తేల్చి చెప్పడంతో మరోసారి గోవా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు గోవాలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇతర పార్టీలకు చెందిన ఎంతమంది ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారు, గోవా ఓటర్లు ఎవరిని కరుణించారు అంటూ ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. అన్ని ఎగ్జిట్స్ పోల్స్ కూడా ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఎమ్మెల్యేలు రారని, ఇతర పార్టీల మద్దతు లేకుండా బీజేపీ కాని, కాంగ్రెస్ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదని తేల్చి చెప్పాయి. అయితే India TV-Ground Zero Exit Poll సర్వే మాత్రం కాంగ్రెస్ దాదాపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎమ్మెల్యేలను గెలిపించుకుంటుందని వెల్లడించింది. ఈ సర్వే మాత్రమే కాంగ్రెస్ కు నాలుగు రాళ్లు ఎక్కువ వేసింది.

తన్నుకు పోయిన బీజేపీ నాయకులు
2017లో గోవా శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేసి ఐదు సంవత్సరాలు అధికారానికి దూరం అయ్యింది. చిక్కిన చాన్స్ సద్వినియోగం చేసుకున్న బీజేపీ నాయకులు గోవాలో అధికారం చేపట్టారు. గోవాలో అధికారం కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకులేకపోయారు.

లీడర్స్ తో పాటు కార్యకర్తలు జంప్ జిలాని
గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం వన్ బై వన్ అంటూ బీజేపీలోకి జంప్ అయ్యారు. ఈ దెబ్బతో గోవాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసహనంతో రగిలిపోయారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించిందని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రగిలిపోయారు. నాయకులతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూల్ గా బీజేపీలోకి జంప్ అయ్యారు.

సేమ్ సీన్ రిపీట్ అవుతుందని చెప్పిన అన్ని సర్వేలు
ఇప్పుడు గోవాలో మరోసారి ఏపార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని అన్ని సర్వేలు తేల్చి చెప్పడంతో మరోసారి గోవా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు గోవాలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇతర పార్టీలకు చెందిన ఎంతమంది ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారు, గోవా ఓటర్లు ఎవరిని కరుణించారు అంటూ ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి.

India TV-Ground Zero Exit Poll
India TV-Ground Zero Exit Poll సర్వే ప్రకారం గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏ పార్టీకి సంపూర్ణ మెజరిటీ రాదని, అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపుకు మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటుందని, ఒకరు ఇద్దరితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించిందిద. 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 10 నుంచి 14 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 25 సీట్లు, ఆప్ కు 1 సీటు, ఇతరులు 1 నుంచి 3 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని India TV-Ground Zero Exit Poll సర్వే వెల్లడించింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications