బ్రాలో బంగారం.. అమ్మాయి కాదు సుమా... ఎంతో తెలుసా..? చూసి ఖంగుతిన్న...
బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. అక్రమంగా తీసుకొచ్చిన బంగారం కస్టమ్స్ కంట్లో పడకుండా ఉండేందుకు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. ఇటీవల ఓ ప్రయాణికుడు కూడా అలాంటి ప్రయోగం చేసి కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం స్కానర్లకు పట్టుబడ్డాడు.
ఈ నెల 22న మాస్కో నుంచి ఎస్‌యూ 232 అనే విమానంలో ఓ ప్రయాణికుడు వచ్చాడు. అతడు భారీగా బంగారం తీసుకొస్తాడని కస్టమ్ అధికారులకు సమాచారం ఉంది. అతడిని నిశీతంగా పరిశీలించిన వారికి బంగారం లభించలేదు. కానీ బ్యాగ్‌కు బంగారు కడ్డీలు అమర్చాడు. అలా ఆరు దొరికాయి. అయినా ఇంకా ఏదో ఉందని వెతికితే.. షర్ట్ లోపల బ్రా ఉంది. బ్రా ఏంటి అని అనుమానించి చూస్తూ అందులో బంగారు తీగలు ఉన్నాయి. ఆరు బంగారు తీగలు కనిపించాయి. ఈ రెండు కలిపి 794 గ్రాముల బరువు ఉంది. వీటి విలువ మార్కెట్లో రూ.30 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు.

అతనిపై కస్టమ్స్ సెక్షన్ 110 చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు గత నెలలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోనే 9 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. బంగారం విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అప్పడు కూడా బంగారాన్ని 12 ముక్కలు చేసి తప్పించుకునేందుకు స్మగ్లర్ ప్రయత్నించాడని అధికారులు చెప్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications