ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం - ధరల పెరుగుదల, కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరగడం, చాలా చోట్ల కొరత నెలకొనడం, నాణ్యతలేని ఉల్లిని కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ)' విభాగం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Recommended Video
ఉల్లి ఎగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు వెలువడే దాకా ఎగుమతులు నిలిపివేయాలని డీజీఎఫ్‌టీ ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే 25 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో సున్నితమైన ఉల్లి పంటపై ప్రతికూల ప్రభావం పడిందని, పంటలు పాడైపోవడం, నిల్వ ఉంచిన సరుకు దెబ్బతినడంతో ఉల్లి కొరత కొరత ఏర్పడింది. గతేడాది కూడా ఈ సీజన్ లో ఉల్లి కొరత ఏర్పడటం తెలిసిందే. కొరతకు తోడు దళారుల అక్రమ దందాతో ధరలు అమాంతం పెరిగిపోయాయి.

దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే కిలో ఉల్లిపాయల ధర రూ.40కి చేరింది. తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ప్రస్తుతానికి కిలో రూ.20కు అటు ఇటుగా ఉన్నప్పటికీ.. కొద్ది రోజుల్లోనే ధరలకు రెక్కలు రావొచ్చనే అంచనాలున్నాయి. కొందరు వ్యాపారులు ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లి నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని కూడా కేంద్రం భావిస్తున్నది. మొత్తంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే ఎగుమతులపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications