లక్కీ బంగ్లా ఖాళీ చేస్తున్న సీఎం, అదే బంగ్లాలోకి డీకే శివకుమార్, అదృష్ట లక్ష్మీ మిస్ !
బెంగళూరు: కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయి పరిపాలన కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది. ప్రజలకు అందుబాటులో ఉండటానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, 8 మంది మంత్రులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రభుత్వ బంగ్లాలు, ఇండ్లు మంత్రులుకు కేటాయిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రులు బెంగళూరులోని కావేరి బంగ్లాను కేటాయిస్తారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్దరామయ్య కావేరి బంగ్లాలో ఉన్నారు. ఈసారి కూడా సీఎం సిద్దరామయ్యకు కావేరి బంగ్లా కేటాయించడంతో త్వరలో ఆయన అక్కడ అధికార నివాసం ఏర్పాటు చేసుకుని మంత్రులు, అధికారులకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు.

ఇక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు కుమారకృప బంగ్లా కేటాయించారు. అయితే ఇప్పటికే కుమారకృప బంగ్లాలో సిద్దరామయ్య ఉంటున్నారు. సిద్దరామయ్యకు కుమారకృప బంగ్లా చాలా అదృష్టం అని, ఆ బంగ్లాలోనే సిద్దూ ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతుంటారని, అది ఆయనకు లక్కీ ఇల్లు అని ఆయన సన్నిహితులు అంటున్నారు.
సిద్దరామయ్యకు ఇప్పుడు కావేరి బంగ్లా కేటాయించారు. అయితే ప్రస్తుతం కావేరి బంగ్లాలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడియూరప్ప నివాసం ఉంటున్నారు. బీఎస్. యడియూరప్ప కావేరి బంగ్లా ఖాళీ చేసి వెళ్లిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ బంగ్లాలోకి వెలుతారని అధికారులు అంటున్నారు.

ఇక సిద్దరామయ్య ప్రస్తుతం నివాసం ఉంటున్న కుమారకృప బంగ్లా ఖాళీ చేసి వెళ్లిన తరువాత ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఆ బంగ్లాలోకి వెలుతారని తెలిసింది. ప్రస్తుతం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బసవరాజ్ బోమ్మయ్ నివాసం ఉంటున్న బంగ్లాను కర్ణాటక మంత్రి ఎంబి. పాటిల్ కు కేటాయించారు.
ఇక మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే నివాసం ఉంటున్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను మంత్రి ప్రియాంక ఖార్గేకి కేటాయించారు. ప్రస్తుతం సిద్దరామయ్య నివాసం ఉంటున్న కుమారకృప బంగ్లా తనకు కచ్చితంగా కావాలని డీకే శివకుమార్ డిమాండ్ చెయ్యడంతో అదృష్టంగా మారిని బంగ్లాను సిద్దరామయ్య త్వరలోనే ఖాళీ చెయ్యాల్సి ఉంది. అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కుమారకృప బంగ్లాలో నివాసం ఉండి తరువాత ఇక్కడి నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యాలని డీకే శివకుమార్ కలలు కంటున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications