హుటాహుటిన స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తమిళనాడు ప్రభుత్వం తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సెలవుల జాబితాను విడుదల చేసింది. రాబోయే ఏడాదిలో మొత్తం 20 రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు పెద్ద సంఖ్యలో లాంగ్ వీకెండ్‌లు లభించనున్నాయి.
తమిళనాడు ప్రధాన కార్యదర్శి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అనేక ముఖ్యమైన సెలవులు సోమవారం లేదా శుక్రవారం వస్తున్నాయి. దీని వల్ల అవి ఆటోమేటిక్‌గా మూడు రోజుల వారాంతపు సెలవులుగా మారనున్నాయి.

కొన్ని పండుగలు మధ్య వారంలో వస్తున్నప్పటికీ, తెలివిగా ఒక్క రోజు సెలవు తీసుకోవడం ద్వారా ఏకంగా నాలుగు రోజుల పాటు లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.జనవరి 15 (గురువారం) సంక్రాంతి తర్వాత, జనవరి 16 (శుక్రవారం) ఒక్క రోజు సెలవు తీసుకుంటే గురువారం నుండి ఆదివారం వరకు మొత్తం నాలుగు రోజులు సెలవు వస్తుంది.
మే 28 (గురువారం) బక్రీద్ తర్వాత, మే 29 (శుక్రవారం) సెలవు తీసుకుంటే మరో నాలుగు రోజుల వారాంతం లభిస్తుంది. దురదృష్టవశాత్తు, కొన్ని ముఖ్యమైన పండుగలు శని లేదా ఆదివారాల్లో రావడంతో లాంగ్ వీకెండ్‌ను పొందే అవకాశం కోల్పోయింది.
ప్రభుత్వ సెలవుల క్యాలెండర్‌లో తమిళనాడు ప్రాంతీయ, మతపరమైన పూజలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది.అలాగే, వాణిజ్య ,సహకార బ్యాంకుల కోసం ఏప్రిల్ 1, 2026 (బుధవారం)న వార్షిక ఖాతాల ముగింపు దినంగా ప్రత్యేక సెలవు ప్రకటించారు.
తమిళనాడు సెలవుల జాబితా ఇదే
జనవరి 1 (గురువారం) - నూతన సంవత్సరం
జనవరి 15 (గురువారం) - సంక్రాంతి
జనవరి 16 (శుక్రవారం) - తిరువళ్లువర్ దినోత్సవం
జనవరి 17 (శనివారం) - ఉఝవర్ తిరునాల్
జనవరి 26 (సోమవారం) - గణతంత్ర దినోత్సవం
మార్చి 21 (శనివారం) - రంజాన్ (ఇదుల్ ఫితర్)
ఏప్రిల్ 1 (బుధవారం) - బ్యాంకు ఖాతాల వార్షిక ముగింపు (బ్యాంకులు మాత్రమే)
ఏప్రిల్ 14 (మంగళవారం) - తమిళ నూతన సంవత్సరం
ఏప్రిల్ 18 (శనివారం) - మహావీర్ జయంతి
మే 1 (శుక్రవారం) - మే డే
మే 28 (గురువారం) - బక్రీద్ (ఇదుల్ అఝా)
ఆగస్టు 15 (శనివారం) - స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 26 (బుధవారం) - మిలాద్-ఉన్-నబి
సెప్టెంబర్ 5 (శనివారం) - శ్రీకృష్ణ జన్మాష్టమి
సెప్టెంబర్ 17 (గురువారం) - వినాయక చతుర్థి
అక్టోబర్ 2 (శుక్రవారం) - గాంధీ జయంతి
అక్టోబర్ 19 (సోమవారం) - ఆయుధ పూజ
అక్టోబర్ 20 (మంగళవారం) - విజయ దశమి
నవంబర్ 8 (ఆదివారం) - దీపావళి
డిసెంబర్ 25 (శుక్రవారం) - క్రిస్మస్.












Click it and Unblock the Notifications