గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉన్నాయి. నెల రోజులకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. యుద్ధ వ్యూహంలో భాగంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దాంతో చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ గ్యాస్, చమురు ధరలు పెరిగాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 5 కిలోల LPG గ్యాస్ సిలిండర్‌ ను అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా కేవలం ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రకటన చేసింది. సమీపంలోని LPG డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది.

Government Update Get a 5kg LPG Gas Cylinder Using Only a Valid ID Card No Address Proof Needed

అలాగే దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా LPG పై ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని సూచనలు చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఔట్‌ లెట్లు సాధారణంగా పనిచేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఇక మూమూలుగా 5 కిలోల సిలిండర్ ను వలస కార్మికులు, ఇతరులు ఎక్కువగా తీసుకుంటారు. వారిని దృష్టిలో ఉంచుకుని 5 కేజీల సిలిండర్ రూల్స్ ను సరళతరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+