వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రూల్స్.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు జీపీఎస్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కొత్తేడాది సందర్భంగా నయా వెహికిల్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో జీపీఎస్ తప్పనిసరి చేసింది కేంద్రం. ఆయా వాహనాలను ట్రాక్ చేయడమే గాకుండా ప్రయాణీకుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రజా రవాణా వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రయాణీకులకు భద్రత లభించనుంది. వాహనాలు ట్రాకింగ్ కావడమే దీనికి కారణం. విద్యార్థులు, మహిళలు ఎవరైనా సరే ఇకపై ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు భయపడాల్సిన అవసరముండదు.

ప్రజా రవాణాకు జీపీఎస్

ప్రజా రవాణాకు జీపీఎస్

ప్రజా రవాణా వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ను తప్పనిసరి చేసింది. అంతేకాదు పానిక్ బటన్ కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలను జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి తెచ్చింది.

కేంద్ర రవాణా వాహనాల చట్టం 1989 పరిధిలోకి వచ్చే బస్సులు, ట్యాక్సీ లాంటి ప్రజా రవాణా వాహనాల్లో వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలి. ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తో పాటు పానిక్ బటన్ ఉండాల్సిందే. అలా ఉంటేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక పాత వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇవి ఉంటేనే వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇష్యూ అవుతుంది. లేదంటే కష్టమే.

వాహనాలు ట్రాకింగ్.. ప్రయాణీకులకు బేఫికర్

వాహనాలు ట్రాకింగ్.. ప్రయాణీకులకు బేఫికర్


ప్రజా రవాణా వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రయాణీకులకు భద్రత లభించనుంది. వాహనాలు ట్రాకింగ్ కావడమే దీనికి కారణం. విద్యార్థులు, మహిళలు ఎవరైనా సరే ఇకపై ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు భయపడాల్సిన అవసరముండదు. మనదేశంలో కోటి 80 లక్షల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలున్నట్లు తెలుస్తోంది. నేషనల్ పర్మిట్ తో ఉన్న ట్రక్స్ తదితర వాహనాలు 70 లక్షలకు పైగా ఉన్నాయి. జీపీఎస్ కొత్త నిబంధనతో ప్రభుత్వమే రంగంలోకి దిగనుంది. పన్ను ఎగ్గొట్టే వాహనదారులను సైతం వీటి ద్వారా ట్రేస్ చేసే వీలుంది.

బీఎస్ఎన్ఎల్ సపోర్ట్

బీఎస్ఎన్ఎల్ సపోర్ట్

జీపీఎస్ విధానానికి ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్.. జాతీయస్థాయి వెహికిల్ ట్రాకింగ్ పోర్టల్ ను డెవలప్ చేసింది. ట్రాకింగ్ పరికరం వివరాలతో పాటు వాహనంకు సంబంధించిన ఛాసిస్ నెంబర్ ను పోర్టల్ కు అనుసంధానిస్తారు. ఈరకంగా రవాణాశాఖతో పాటు పోలీస్ శాఖ కూడా ఈ సమాచారంతో వాహనాలు ట్రాక్ చేసే ఛాన్సుంటుంది. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ పర్యవేక్షించడానికి స్టేట్ గవర్నమెంట్ ఆపరేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జీపీఎస్ కొత్త రూల్స్ ప్రకారం ఏఐఎస్‌- 140 ధ్రువీకరణ కలిగిఉన్న ట్రాకింగ్ పరికరాలు మాత్రమే వాహనాల్లో బిగించాల్సి ఉంటుంది.

English summary
The GPS was mandatory in public transport vehicles. Passengers will be given security in the decision taken by the Center to make GPS mandatory. This is because vehicles are tracking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X