వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ భూకంపం: ఎయిర్ ఫోర్స్‌పై సచిన్, ప్రధాని మోడీ ట్వీట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్ భూకంప బాధితులకు సహాయం అందిస్తున్న భారత ఎయిర్ ఫోర్స్ సేవలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కొనియాడారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలు అమోఘం అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పలువురు భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని కితాబిచ్చారు.

ఓ వైపు వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దైర్యంతో పని చేస్తున్నాయన్నారు. భూకంప ప్రాంతంలో చిక్కుకు పోయిన 1900 మందిని ఇప్పటి వరకు వారు తసుకు వచ్చారని కొనియాడారు.

ఇండియన్ ఆర్మీపై ప్రధాని మోడీ

భూకంపం ధాటికి విలవిల్లాడుతున్న నేపాల్‌లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఆర్మీకి, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఇతరులకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయన ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. నేపాల్‌లో సంభవించిన విపత్తుపై వెంటనే స్పందించి ఆదేశంలో సహాయ చర్యలు చేపట్టినందుకు గాను మోడీపై ప్రశంసలు కురిపిస్తూ దేశ, విదేశాల నుంచి పలువురు ట్వీట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన ప్రధాని మోడీ నేపాల్‌ను యాథాతథ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు, వైద్యులు, వాలెంటర్లీకు నిజమైన అభినందలు తెలపాలని ట్వీట్‌ చేశారు. ప్రధాని మోడీ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. మీడియా ధైర్యంగా గ్రౌండ్ నుండి కవరేజ్ ఇస్తోందని కితాబిచ్చారు.

English summary
Great relief work being done by the Indian Air Force. Have brought back over 1900 stranded Indians by flying sorties braving the bad weather
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X