గుజరాత్ ఎన్నికలు, కాంగ్రెస్ కు హార్దిక్ పటేల్ డెడ్ లైన్, మాదారి మేము చూసుకుంటాం !
గుజరాత్ ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీకి అర్దరాత్రి డెడ్ లైన్ 30 సీట్లు కావాలంటున్న హార్దిక్ పటేల్, ఆలోచిస్తున్న కాంగ్రెస్బీజేపీ 15 సీట్లు ఇచ్చింది, హార్దిక్ కోసం అంత సాహసం చెయ్యాలా ?
అహ్మదాబాద్: గుజరాత్ లోని పటీదార్ ఉద్యమనేత హార్థిక్ పటేల్ మరోసారి కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ పెట్టారు. శనివారం అర్ధరాత్రిలోపు తమ డిమాండ్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని హార్దిక్ పటేల్ తేల్చి చెప్పారు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పటేల్ వర్గం డిమాండ్లను ఒప్పుకోవాలని హార్థిక్ పటేల్ కు చెందిన పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసువచ్చింది. గుజరాత్ లో డిసెంబర్ లో జరుగుతున్నశాసన సభ ఎన్నికల్లో పటీదార్ వర్గానికి 30 సీట్లు ఇవ్వాలని హార్దిక్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే బీజేపీ నాయకులు పటీదార్ వర్గానకి 15 సీట్లు కేటాయించడంతో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మీద మరింత ఒత్తిడి తీసుకువస్తున్నారు. 30 సీట్ల కంటే తక్కవ సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆలోచిస్తామని హార్దిక్ పటేల్ అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం హార్దిక్ మద్దతు కోసం అన్ని సీట్లు ఇవ్వడమంటే చాలా కష్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది. సీట్ల కేటాయించే విషయంలో చర్చించేందుకు హార్థిక్ మద్దతుదారులను కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిచారు.
ఈ చర్చల నేపథ్యంలో ఢిల్లీలో మకాం వేసిన పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ దినేశ్‌బంభానియా మీడియాతో మాట్లాడుతూ శనివారం అర్ధరాత్రిలోపు తమ డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని, లేదంటే కాంగ్రెస్‌కు తమ మద్దతు అవసరం లేదని మేము భావించాల్సి ఉంటుదని దినేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరిని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని దినేష్ మీడియాకు చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications