తండ్రి కల నెరవేరింది: పుట్టిన రెండు గంటల్లోనే చిన్నారికి ఏమి వచ్చాయో తెలుసా..?
బిడ్డ జన్మించిన 1.48 నిమిషాల్లోనే ఆదార్ కార్డు కోసం పేరు నమోదు చేయించి ఏప్రిల్‌లో రికార్డు సృష్టించారు మహారాష్ట్రకు చెందిన తల్లిదండ్రులు . ఆ ఘటన మరువక ముందే గుజరాత్‌కు చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డ పుట్టిన రెండు గంటలకే ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, రేషన్ కార్డు ఇలా అన్నిటిని పొంది సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో అంకిత్, నాగరాణి దంపతులు నివసిస్తున్నారు. నాగరాణి గర్భం దాల్చినప్పటి నుంచే పుట్టబోయే బిడ్డకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాలో భాగస్వామిని చేయాలని భావించారు. ఇందుకోసం వారు చాలా ముందుగానే ప్రిపేర్ అయ్యారు. ఇక నెలలు నిండి నాగరాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆపాప పేరు కూడా రమైయా అని పెట్టాలని ముందే అనుకున్నారు. ఇక రమైయా పుట్టిన రెండు గంటలకే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్టు లభించాయి. దీంతో రమైయా పుట్టిన రెండు గంటల్లోనే డిజిటల్ పద్ధతుల ద్వారా అన్ని డాక్యుమెంట్లు పొందిన చిన్నారిగా సరికొత్త రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోని సూరత్‌లో డిసెంబర్ 12న రమైయా జన్మించింది.

అధికారుల సహకారంతో తన బిడ్డకు పుట్టగానే అన్ని డాక్యుమెంట్లు పొందాలన్న కల సాకారమైందని చిన్నారి తండ్రి అంకిత్ తెలిపారు. అంతేకాదు పుట్టినప్పటి నుంచే తాను డిజిటల్ ఇండియాలో భాగస్వామి అయినందుకు గర్వంగా భావిస్తుందని తండ్రి అంకిత్ తెలిపారు. అయితే ఈ కలను సాకారం చేసుకునేందుకు ముందుగా జన్మ ధృవపత్రాన్ని తయారు చేయించారు. దాని తర్వాత అన్ని డాక్యుమెంట్లు త్వరతగతిన అధికారుల సహకారంతో పూర్తయినట్లు రమైయా తల్లి దండ్రులు చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications