అమెరికాలో భార్య దారుణ హత్య: భర్త కోసం ఎఫ్‌బీఐ వేట, పట్టిచ్చిన వారికి రూ. 70లక్షల రివార్డ్
న్యూఢిల్లీ: కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడి కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వేట కొనసాగిస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారీలో ఉన్నాడు.

ఒకే సంస్థలో పనిచేస్తూ..
ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ అతని కోసం తీవ్రంగా గాలింపు చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. 24ఏళ్ల భద్రేశ్ కుమార్, అతని భార్య పాలక్(21) అమెరికాలో నివాసం ఉంటూ హనోవర్ మేరీల్యాండ్‌లోని డంకిన్ డోనట్ స్టోర్‌లో పనిచేసేవారు. 2015 ఏప్రిల్‌లో వీరిద్దరూ ఆ స్టోర్‌లో రాత్రిపూట విధులు నిర్వహించారు.

ఆ రాత్రే పాలక్ దారుణ హత్య..
ఆ రాత్రే పాలక్ దారుణ హత్యకు గురైంది. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు.. స్టోర్‌లోని సీసీఫుటేజీని పరిశీలించి దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఏమి ఎరుగనట్లుగా..
హత్య జరిగిన రోజు రాత్రి భద్రేశ్ కుమార్ తన భార్యతో కలిసి స్టోర్ వంట గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లుగా బయటికి వచ్చేశాడు భద్రేశ్ కుమార్. ఇదంతా సీసీ ఫుటేజీలో కనిపించింది. కాగా, స్టోర్ నుంచి ఇంటికి వెళ్లిన భద్రేశ్.. తన సామాన్లు తీసుకుని సమీప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి పరారైన భద్రేశ్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.
రూ. 70 లక్షల రివార్డలు..
ఈ నేపథ్యంలో తమ చిక్కకుండా తిరుగుతున్న పది మంది నిందితుల్లో భద్రేశ్ కుమార్‌ని కూడా చేర్చింది ఎఫ్‌బీఐ. అతని కోసం అమెరికాతోపాటు భారతదేశంలోనూ తీవ్రంగా గాలిస్తోంది. అంతేగాక, భద్రేశ్ కుమార్‌ను పట్టి ఇచ్చిన వారికి లక్ష డాలర్లు(రూ. 70లక్షల నగదు) ఇస్తామని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది.
-
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications