వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మటన్ కావాలో, నేను కావాలో తేల్చుకోమన్న భర్త!: దిమ్మతిరిగే సమాధానంతో షాక్..

మటన్ కావాలో.. తాను కావాలో తేల్చుకో అంటూ సవాల్ అయితే విసిరాడు కానీ ఆహారపు అలవాట్ల కోసం భార్య ఎక్కడ తనను వదిలేస్తుందోనన్న భయం అతనికి పట్టుకుంది.

|
Google Oneindia TeluguNews

ముంబై: ఇదో వింత పంచాయితీ.. ఒకరకంగా వితండవాదం అని కూడా అనవచ్చు. తనకు నచ్చిన ఆహారాన్నే తినాలని భార్యపై ఓ భర్త పేచీ. ఆయనో శాఖాహారి. భార్యకు మాత్రం 'మటన్' అంటే ఇష్టం. తాను నాన్‌వెజ్ తినను కాబట్టి.. భార్యను కూడా మానేయాలనేది సదరు భర్త డిమాండ్.

ఇందుకోసం ఏకంగా ట్విట్టర్ గూటికి ఎక్కి మరీ తన పంచాయితీకి పరిష్కారం చూపించాల్సిందిగా ప్రముఖ బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ భర్త శిరీష్‌ కుందర్‌ను ట్విట్టర్ లో వేడుకున్నాడు. చివరకు శిరీష్ కుందర్ చెప్పిన సమాధానం విని పాపం షాక్ తిని ఉంటాడు.

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ఓ వెజిటేరియన్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి మరో వెజిటేరియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఫ్యామిలీ వెజిటేరియన్ అయినా అమ్మాయికి మాత్రం 'మటన్' తినడం అంటే చాలా ఇష్టం. ఆ విషయం అతనికి కూడా చెప్పింది. దీంతో మటన్ సంగతి పక్కనబెట్టి అమ్మాయి అందంగా ఉందని పెళ్లి చేసుకున్నాడు.

అయితే పెళ్లయ్యాక మటన్ తినడం మానేస్తానని ఆ అమ్మాయి పెళ్లికి ముందెప్పుడో చెప్పిందట.ఇక అదే మాటను పట్టుకుని మాంసాహారం మానేస్తావా? లేక నన్నే విడిచిపెడుతావా? తేల్చుకో.. అంటూ పేచీకి దిగాడు. ఆమె మాత్రం మటన్ తినడం మానలేదు, పైగా అది నావల్ల కాదని తేల్చి చెప్పింది. దీంతో ఏకంగా ట్విట్టర్‌కి ఎక్కి తన సమస్యకు పరిష్కారం చెప్పాలని కోరాడు.

మటన్ కావాలో.. తాను కావాలో తేల్చుకో అంటూ సవాల్ అయితే విసిరాడు కానీ ఆహారపు అలవాట్ల కోసం భార్య ఎక్కడ తనను వదిలేస్తుందోనన్న భయం అతనికి పట్టుకుంది. ఈ మొత్తం విషయాన్ని శిరీష్ కుందర్‌కు చెప్పగా.. ఇలాంటి వింత ప్రేమకథను తొలిసారి వింటున్నానని, కంగ్రాట్స్ అని చెప్పాడు. అయితే 'మనుషులు ప్రేమ లేకుండానైనా ఉండగలరు గానీ ఆహారం లేకుండా ఉండలేరు కదా?' అని సమాధానం ఇచ్చాడు. దీంతో సదరు భర్త గారికి షాక్ తిన్నంత పనైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

English summary
If you are a regular on Twitter (which I am safely guessing you are) then, you must have at least once in your usual day-scroll, chanced upon something by Shirish Kunder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X