Viral Video: 3,400 ముద్దులు.. రూ.5,500 ఫైన్!

Viral Video: సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లు, వ్యూస్, ఫాలోవర్ల కోసం ఈ కాలం యువత ఎంతటి విన్యాసాలకైనా వెనుకాడటం లేదు. విదేశాల్లో ట్రెండవుతున్న ఓ వైరల్ కాన్సెప్టును అనుసరించి.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్ అనే యువకుడు తన సొంత స్విఫ్ట్ కారును కిస్సింగ్ కారుగా మార్చేశాడు. ఆదిత్య ప్రియురాలు ఎర్రటి లిప్‌స్టిక్ సహాయంతో దాదాపు మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు శ్రమించి కారు బాడీ అంతటా ఏకంగా 3,400 ముద్దుల గుర్తులను ముద్రించింది. అనంతరం ఆ కారుతో నగరంలో తిరుగుతూ తీసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కరోజులోనే 55 లక్షలకు పైగా వ్యూస్ సాధించి తీవ్ర సంచలనం సృష్టించింది.

భర్తకు తెలియకుండా దాచిన రూ.12 లక్షలు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాకే!
భర్తకు తెలియకుండా దాచిన రూ.12 లక్షలు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాకే!

అయితే ఈ కిస్సింగ్ కారుతో ఆదిత్య సికర్వార్ గ్వాలియర్ సిటీ సెంటర్ నుంచి థాటిపూర్ ప్రాంతం వరకు ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పాదచారుల దృష్టి అంతా ఆ కారుపైనే పడింది. అందరూ వాహనాలు ఆపి మరీ కారును ఆశ్చర్యంగా చూడటంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో సాధారణ ప్రజలకు అంతరాయం కలిగింది. రోడ్డుపై ప్రజల ఏకాగ్రతను దెబ్బతీస్తూ.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేలా ఈ కారు ప్రయాణం సాగడంతో గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

Gwalior Kissing Car Viral Video Youth Fined Rs 5 500 for 3 400 Lipstick Marks on his Swift Car Details

వైరల్ వీడియోలోని కారు నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు థాటిపూర్ ప్రాంతంలో వాహనాన్ని కనుగొని దానిని స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ సుబేదార్ అభిషేక్ రఘువంశీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఇతరులకు ప్రమాదకరంగా మారేలా, ట్రాఫిక్ నియమాలను తుంగలో తొక్కి వాహనం నడిపినందుకు గానూ మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఆదిత్యకు రూ.5,500 జరిమానాను విధించడమే కాకుండా.. కారుపై ఉన్న గుర్తులన్నింటిని తన సొంత చేతులతో రుద్ది మరీ కడిగించారు.

Viral Video: యాచకురాలు మృతి.. ఇంట్లో కరెన్సీ కట్టలు, నాణేల కుప్పలు!
Viral Video: యాచకురాలు మృతి.. ఇంట్లో కరెన్సీ కట్టలు, నాణేల కుప్పలు!

పోలీసుల వార్నింగ్, జరిమానా దెబ్బతో ఆ యువకుడు తన తప్పును అంగీకరించాడు. రీల్స్ పిచ్చిలో పడి తాను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఒప్పుకున్నాడు. సోషల్ మీడియా ఫేమ్ కోసం రోడ్డు భద్రతను పణంగా పెడితే చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+