500 కోట్ల వ్యూస్.. YouTube లో సంచలనం సృష్టించిన సాంగ్..

ఈ పాట YouTubeలో సంచలనం సృష్టించింది. భారత్ నుంచి 500 కోట్ల వ్యూస్ సాధించిన తొలి వీడియోగా చరిత్ర లిఖించింది. అదే 'శ్రీ హనుమాన్ చాలీసా' సాంగ్.. ఈ పాటను టీ- సిరీస్ సంస్థ 2011 మే 10 న అప్ లోడ్ చేసింది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 500 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 2కోట్ల మందికి పైగా లైక్ చేశారు. దాదాపు 30 లక్షలకుపైగా కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికీ ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. ఈ పాటను లలిత్ సేన్ కంపోజ్ చేశారు. హరిహరన్ పాడారు. ఈ భక్తిపాట ఇప్పుడు ఆల్ టైమ్ మోస్ట్ వ్యూయిడ్ వీడియోల లిస్టులో చేరింది.

Hanuman Chalisa Roars to 5 Billion Views India s Devotional Anthem Conquers YouTube

భారత్ లో హనుమాన్ ను ఏ విధంగా పూజిస్తారో మనకు తెలిసిందే. ప్రతి గ్రామంలో హనుమాన్ విగ్రహం మనకు కనిపిస్తుంటుంది. రామాలయం ఉంటుంది. ఇక హనుమాన్ జయంతి, శ్రీ రామనవమి లాంటి పర్వదినాలను దేశ వ్యాప్తంగా భక్తులు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక హనుమాన్ పాటలతో హనుమాన్ చాలీసా విశిష్టమైనదిగా చెబుతుంటారు. ఈ క్రమంలో యూట్యూబ్ లో శ్రీ హనుమాన్ చాలీసా సంచలన వ్యూస్ ను రాబట్టింది. 2011 నుంచి ఇప్పటివరకూ 500 కోట్ల వ్యూస్ కు పైగా సాధించిన భారతీయ వీడియోగా రికార్డు సృష్టించింది.

శ్రీ హనుమాన్ చాలీసా సాంగ్ కు దరిదాపులో భారత్ లోని ఏ బాలీవుడ్ , పంజాబీ, ఇతర సూపర్ స్టార్స్ పాటలు లేకపోవడం గమనార్హం. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక వీడియో ఇదే కావడం విశేషం. దాంతో ఈ వీడియో టాప్ 10 మోస్ట్ వ్యూయిడ్ వీడియోస్ ఆఫ్ యూట్యూబ్ లో చోటు సంపాదించింది. ఈ పాటను హృదయానికి హత్తుకునేలా హరిహరణ్ పాడారు. లలిత్ సేన్ మ్యూజిక్ అందించారు. టీ- సిరీస్ భక్తి ఛానెల్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియోను శుంభు గోపాల్ డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+