Exit Polls 2024: హర్యానాలో ఆ పార్టీకే ఎడ్జ్- తేల్చేసిన దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ ..!

హర్యానాలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతోందన్న అంశంపై జాతీయ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీజేపీ మాత్రం రెండో స్ధానానికే పరిమితం కాబోతోందని తేలిపోయింది. మిగతా పార్టీలు నామమాత్రపు సీట్లతో సరిపెట్టుకోక తప్పదని దైనిక్ భాస్కర్ తేల్చేసింది.

దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ లో 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 44 నుంచి 54 సీట్లు సాధించి అగ్రస్దానంలో నిలవబోతున్నట్లు తేలింది. అలాగే బీజేపీకి కేవలం 15-29 సీట్లు లభించబోతున్నట్లు తెలిపింది. జేజేపీ కూటమికి 0-1 సీట్లు, ఐఎన్ఎల్డీ కూటమికి 1-5 సీట్లు, ఇతరులు 4-9 సీట్లు సాధించబోతున్నట్లు దైనిక్ భాస్కర్ వెల్లడించింది. హర్యానా అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా కనీసం 46 సీట్లు సాధించాల్సి ఉంటుంది.

Haryana exit polls 2024 dainik Bhaskar predicts congress party victory with 44-54 seats

మరోవైపు హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా.. దాదాపు వెయ్యి మంది అభ్యర్ధులు ఈసారి పోటీలో నిలిచారు. అలాగే దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఓటేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖీ పోటీ జరిగింది. అలాగే జేజేపీ-ఏఎస్పీ, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ, ఆప్ కూడా పోటీలో ఉన్నాయి. ఈ నెల 8న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+