హర్యానా పాన్ వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు!

న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన ఓ పాన్‌వాలాకు ఈ దీపావళికి ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ రూ. 132 కోట్ల విద్యుత్ బిల్లుని కానుకగా ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. సోనే పట్ జిల్లాలోని గోహానాలో పట్టణంలో ఓ చిన్న పాన్ షాప్ నిర్వహిస్తున్న అతడికి రూ. 132.29 కోట్ల మేర విద్యుత్‌ను వాడుకున్నారని హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డు బిల్లు జారీ చేసింది.

కరెంట్ బిల్లుని చూసిన తర్వాత రాజేష్ మాట్లాడుతూ "బిల్లుని చూసి షాక్‌కు గరయ్యాను. అంకెల్లో ఏమైనా తప్పు పడిందేమోనని పరిశీలనగా చూడగా.. అక్షరాల్లో కూడా అంతే మొత్తం ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Haryana paanwala gets Rs.132 crore power bill

ఓ చిన్న షాప్‌ను అద్దెకు తీసుకుని అందులో పాన్ షాప్‌ను నిర్వహిస్తున్నాను. ఓ బల్బుతో పాటు ఒక ఫ్యాన్ మాత్రమే వినియోగించే నాకు నెలకు రూ.1,000 లోపే బిల్లు వస్తోంది. ఈ సారి మాత్రం షాకిచ్చే బిల్లే వచ్చింది' అని ఆ పాన్ వాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

అక్టోబర్ కు సంబంధించిన ఈ భారీ బిల్లును తీసుకుని రాష్ట్ర విద్యుత్ శాఖ ను కలుస్తానని అతడు చెప్పాడు. ఈ విద్యుత్ బిల్లుని ఉత్తర హర్యానా వితరణ్ నిగమ్ (UHBVN) నుంచి జారీ చేయబడింది.

గతంలో కూడా హర్యానా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఇలాంటి తప్పిదాన్నే చేసింది. 2007 ఏప్రిల్‌లో నార్నల్ పట్టణంలో ఓ వినియోగదారుడికి రూ.234 కోట్ల విద్యుత్ బిల్లుని జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+